Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జైతన్య మొంది వస్త్రంబులఁ గనుపట్టు
              చిత్రరూపంబులు శిరము లూఁప


తే.

నొళవు చిగురింప దివ్యపయోజనేత్ర
గ్రామములు మూఁడు [1]నిఖిలమూర్ఛనల తెఱఁగు
మంద్రమధ్యమ[2]తారక్రమంబు మెఱయఁ
బాడె రెండవశారదభంగిఁ బొంగి.

29

[3]సంకుసాల సింగయ్య - కవికర్ణరసాయనము [5-87]

ఉ.

పట్టిన హస్తకాంతి మును పల్లవితంబగు వీణె పాటచేఁ
బుట్టు చిగుళ్ళ రెట్టి యగు పొల్పు వహింప మొగంబు తావికిన్
జుట్టిన తేంట్లకున్ శ్రుతులు సూప సుధారసధార[4]పాలికం
[5]బట్టి మృదుస్వరం బెసఁగఁ బాడె నొకర్తు మనోజ్ఞభంగులన్.

30

జయతరాజు ముమ్మయ – విష్ణుకథానిధానము

సీ.

రాగంబు[6]లను శుద్ధరాగ[7]సాళగరాగ
              సంకీర్ణరాగముల్ చక్కఁ దీర్చి
స్త్రీపున్నపుంసకరూపంబు లనువాని
              వేళలు మైత్రియు వెలయఁ జూపి
తాన ప్రపంచవిస్తారంబు [8]మెఱయుచోఁ
              గ్రొత్తతానంబులు గొసరి కొసరి
స్వరమూర్ఛనాగ్రామజాతిశ్రుతుల లక్ష
              ణములకు నపుడు లక్ష్యములుగ


తే.

+ + + + లొదవంగఁ దగిన శుద్ధ
దేశమార్గములను రాణఁ దేట పడఁగ
సకలమోహన[9]సంగీతచతురుఁ డగుచు
వేణుగానంబు ప్రకటించె విశ్వగురుఁడు.

31

మాదయగారి మల్లయ్య - రాజశేఖరచరిత [3-167]

శా.

డాకేల న్నిజకన్యకామణుల కంఠశ్రేణి గీలించి వీ
క్షాకంజాతము లాత్మపాదశిఖరేఖం దాల్చి సంగీతవి
ద్యాకౌశల్యము గానరా మదికి నాహ్లాదంబు సంధిల్ల [గౌ
రీకల్యాణము పాడి] రప్పుడు పురంధ్రీరత్నముల్ వేడుకన్.

32
  1. క.శిఖల
  2. క.తారకక్రమము
  3. సుంకసాల
  4. క.బాళికిన్
  5. క.బట్టు
  6. చ.లగు
  7. క.సోళగ
  8. చ.చూపుచో
  9. క.సంగత