|
తానమానములలోఁ దాళనిర్ణయలీలఁ
జరణపల్లవముల సంగ్రహించి
|
|
తే. |
యఖిలమును మెచ్చఁ బ్రత్యక్షమైన యట్టి
నాట్యవిద్యాధిదేవత నాఁ దనర్చి
భరతశాస్త్రమర్మజ్ఞతాప్రౌఢి మెఱసె
యూర్వశీకాంత వేల్పుఁబేరోలగమున.
| 26
|
తే. |
అపుడు తానావసానంబునందు మధ్య
కీలితంబయి [మొప్పెఁ] గెంగేలు వలికి
నలియవుగదా యటంచు నా నడిమితీఁగ
నుపచరింపఁగ వచ్చినదో యనంగ.
| 27
|
చదలువాడ యెఱ్ఱాప్రెగడ - నరసింహపురాణము [2-83]
సీ. |
అమృతంపుసోనపై నడరిన ట్లేపాట
చెన్నున మోళ్ళును చిగురు లొత్తి
మారుతాహతిపేర మ్రాకులు దలయూఁపఁ
దొడఁగె [1]సంగీతమాధుర్యమునకు
నింపులగని యైన యీరాగరసము దీఁ
గలఁకు గోరకపులకల నొసంగె
సెలయేఱు లన నశ్రుజలముల దొరగించె
గిరులు[2]ను మంజులగీతిఁ గరఁగె
|
|
ఆ. |
ననినఁ బోలుఁ బొసగు నగుఁ దగు ననఁగ న
చేతనంబు లెల్లఁ జిత్రరూపు
లట్లు [సొ]గిసె నిలువ నంగన యొక్కతె
పాడెఁ గలమనోజ్ఞభంగు లలర.
| 28
|
చరికొండ ధర్మయ్య - చిత్రభారతము [3-34]
సీ. |
తనభూషణంబులఁ దనరెడి మాణిక్య
గణము నొక్కుమ్మడిఁ గరఁగి పాఱ
నీరసాకృతిఁ బొల్చు నిష్ఠురస్థాణువుల్
భాసురలీలఁ గ్రొమ్మోసు లెత్త
నా[3]సమీపంబున నల్లల్లఁ జరియించు
మృగపక్షిజాతంబు మేఁత లుడుగఁ
|
|
- ↑ క.నేగీత
- ↑ క.న
- ↑ క.సమీపము నలనల్లన