Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

మనమునఁ బ్రమో[1]దాయత్తుండనై యిట్లని వితర్కించితి.

5


చ.

జననుతులౌ కవీశ్వరుల సత్కృతిసారముఁ గావ్యసౌరవ
ర్ణనమని చేసి నీల[గిరినాథుని కర్పణ] సేయు టొప్పుఁ జ
క్కని పదియాఱువన్నె కనకంబున వాసన కమ్మకస్తురిన్
గనదురుకాంతియన్ జెఱకునన్ ఫల మబ్బుట భాగ్యమేకదా!

6


వ.

అని కృతనిశ్చయుండనై జగన్నాథదేవకరుణాసుధాసారంబునఁ గావ్యసారం బొనరింపఁ బ్రారంభించి మదీయవంశావతారం బభివర్ణించెద.

7


సీ.

తన ప్రభుత్వము దేవతాప్రభుత్వమున కెం
              తయు నొప్పు [2]వేయి నేత్రముల వానిఁ
దన లావుచే భూతధాత్రీతలం బెల్లఁ
              దలఁ బూనుకొను [3]వేయి తలల వానిఁ
దనపేరుఁ దడవిన జనుల పాపౌఘముల్
              మర్దించు [4]వేయి నామముల వానిఁ
దన మూర్తి త్రిభువనతమస మౌల సనంగఁ
              దఱిమెడు [5]వేయి పాదముల వానిఁ


తే.

దనదు కూరిమి సుతునిఁగాఁ గనిన వానిఁ
దరమె వర్ణింప సంతతోదారకీర్తి
ననుపమజ్ఞానమూర్తి దయానువర్తి
భవ్యగుణ[6]ఖని కశ్యపబ్రహ్మమౌని.

8


శా.

ఆ మౌనీంద్రుశుభాన్వయప్రకటదుగ్ధాంభోధిశుభ్రాంశుఁ డౌ
రామప్రెగ్గడగంగరాజునకు విభ్రాజద్యశఃస్ఫూర్తి వ
ల్లామాత్యుం డుదయించి కాంచె నురుభవ్యాకారులన్ బేర్మి నా
[7]రామాత్యాగ్రణి గంగరాయని సముద్యద్బంధుమందారులన్.

9


వ.

అందగ్రజుండు.

10


ఉ.

దండెగు ప్రత్తిపాటిపురధాముఁడు (వ)ల్లన (నారమంత్రితా(వ)ల్లన)
నిండిన వేడ్క నారరథినీవతి వీరమనున్ వివాహమై
కొండయతిమ్మమంత్రిమణికోవిదులన్ గనియెన్ బ్రసూనకో
దండజయంతతుల్యసముదంచితరూపవిలాసవంతులన్.

11


వ.

తదనుజుండు.

12


చ.

శరనిధికన్యకామణిని శౌరి వరించిన సొంపునన్ మనో
హరగుణశాలి గంగసచివాగ్రణి సమ్మతిఁ బెండ్లియాడె నా

  1. క. దదాయకుఁడనై
  2. క.ట. వేయు
  3. క.ట. వేయు
  4. క.ట. వేయు
  5. క.ట. వేయు
  6. క. మౌని
  7. ట. రామ