|
మిళితవిలాసులై చెలువు మీఱుఁ బురీవనముల్ జగజ్జయా
కలితరమాభిరామనవకామమహాశిబిరంబులో యనన్.
| 248
|
మ. |
కలయన్ గాడ్పునఁ దూలి పుప్పొడి దివిన్ [1]గప్పారు మారుండు వే
డ్కల కారామరమావసంతులఁ గణంకన్ బెండ్లి సేయించుచో
వెలయన్ బట్టిన యుల్లభంబుపగిదిన్ వేమాఱుఁ దద్భూమిపైఁ
జెలు వొందింపుచు రాలుఁ బుష్పవితతుల్ [2]చేకొన్న ప్రాలో యనన్.
| 249
|
నన్నయభట్టు - ఆదిపర్వము [1-8-78]
చ. |
సరళతమాలతాలహరిచందనచంపకనారికేళకే
సరకదళీలవంగపనసక్రముకార్జునకేతకీలతా
గరుఘనసారసాలసహకార[3]మహీరుహరాజరాజి సుం
దరనవనందనావళులఁ దత్పురబాహ్యము లొప్పుఁ జూడగన్.
| 250
|
సంకుసాల [4]సింగయ్య - కవికర్ణరసాయనము [1-23]
మ. |
అజహచ్చంద్రవిజృంభముల్ శుకపికాద్యారూఢనానావిధ
ద్విజమృష్టాన్నయథేష్టసత్రగృహముల్ దీవ్యన్మదోత్సేకభా
వజసర్వస్వము లంచితానిలమహాస్వారాజ్యముల్ దంపతీ
వ్రజతారుణ్యసమృద్ధిసాక్షులు పురప్రాంతస్థితారామముల్.
| 251
|
సీ. |
శుకమంజులాలాపశుభకరస్థితి మించి
పల్లవసందోహభాతిఁ దనరి
కలకంఠకూజితవిలసనంబుల నొంది
రాకాంశురేఖల రమణ మెఱసి
హరిచందనస్ఫూర్తి ననిశంబుఁ దనరారి
పుష్పసౌరభములఁ బొలుపు మిగిలి
సరసాళిమాలికాసంసక్తి విలసిల్లి
విషమబాణాసనవృత్తిఁ జెంది
|
|
తే. |
లలితమాకందవైభవంబులఁ దనర్చి
యతిమనోహరాకారత నతిశయిల్లి
యుద్యదుద్యానవాటిక లొప్పు మిగిలె
వారవనితలు నాఁ బురవరమునందు.
| 252
|
- ↑ ట.గప్పంచు
- ↑ క.చేతన్న
- ↑ క.వనాధిప
- ↑ బసవయ్య