Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దొడరుట కప్పురంపుబిరుదుల్ గగనంబున కెత్తెనో యనన్
బొడవున నాడుచుండు నృపపుంగవ! మారుతవైజయంతికల్.

162

[1]సంకుసాల సింగయ – కవికర్ణరసాయనము [1-6]

ఉ.

కన్నులపండువై పొలుచుఁ గన్గొన నప్పురలక్ష్మి సారెకున్
వి న్ననువొప్ప విచ్చు నెఱివేణితెఱంగున మందమారుతో
ద్యన్నిజకేతనాంచలకరాగ్రములం బ్రవిసారితంబులై
యున్నతసౌధశైలశిఖరోపరిలంబితమేఘలేఖికల్.

163

సాలభంజికలు

[2]పణిదవు మాధవుఁడు - ప్రద్యుమ్నవిజయము

ఉ.

పోలఁగ [3]నిందులన్ గలుగు పుష్పసుగంధుల రూపవైభవ
శ్రీ లరయంగఁ గోరి యటఁ జేరిన ఖేచరయక్షదైవత
స్త్రీ లని సంశయింపఁగఁ బురీజను లద్భుతదర్శన[4]క్రియా
చాలనదూరత న్నెఱయు సౌధహిరణ్మయసాలభంజికల్.

164

గోపురములు

నన్నయభట్టు – ఆదిపర్వము [1-8-77]

చ.

తమము నణంచుచున్ వెలుఁగుఁ దత్పురగోపురశాతకుంభకుం
భముల విచిత్రసన్మణిగభస్తివితానములన్ విచిత్రవ
ర్ణములగు నాత్మవాహముల నమ్మక పల్మఱుఁ జూచి యన్యవా
హములని సంశ[5]యప్రణిహితాత్ముఁ డగున్ హరిదశ్వుఁ డెప్పుడున్.

165

పొన్నాడ పెద్దిరాజు - ప్రద్యుమ్నచరిత

క.

పురగోపురశిఖరంబులం
గరమరు [6]దగు పద్మరాగకలశము [7]లొప్పున్
చరమాచరమాద్రులపై
సరిఁ బున్నమఁ దోఁచు [8]సూర్యచంద్రుల కరణిన్.

166

పెదపాటి యెఱ్ఱాప్రెగడ - కుమారనైషధము

క.

కురువిందవజ్రమయగో
పురకాంతులవలనఁ బ్రొద్దుపోకలు రాకల్

167
  1. సుంకసాల
  2. ఫణిధవు
  3. ట.నందులం
  4. ట.ప్రియా
  5. క.యింపఁ బ్రణితాత్ముఁడు
  6. ట.దై
  7. ట.లమరున్
  8. క.నూత్న