తే. |
గ్రహములును శత్రుమిత్రయోగములు [1]దశలు
నంశవేధయు భూతబీజాక్షరముల
[2]పొత్తువులు దెల్పి [3]శాంతవిస్ఫురణఁ దనరు
సత్కవీంద్రుని కృతి బుధసభల వెలయు.
| 108
|
కవిలోకబ్రహ్మ - కేదారఖండము
సీ. |
లలిఁ గావ్యనాటకాలంకారములు సూచి
శబ్దప్రపంచంబు జాడఁ దెలిసి
వర్ణోద్భవవ్యక్తి వర్గగ్రహారిమి
త్రస్నిగ్ధరూక్షచింతనము లెఱిఁగి
గణరూపదేవతాగ్రహమైత్రినక్షత్ర
మాతృకాపూజాదిమార్గ మెఱిఁగి
జల్లి విక్రియ కాకు పొల్లు వ్యర్థముద్రాభ
విరసంబు గ్రామ్యోక్తి పరిహసించి
|
|
తే. |
కవిత సెప్పినఁ దగుఁగాక కవిసి నోరి
కొలఁదు లివ్వల నవ్వలఁ గూర్చి తెచ్చి
దిట్టకూళతనంబున వట్టి బిగిని
కావ్యమని చెప్ప మెత్తురే కవిజనములు.
| 109
|
మ. |
పదలాలిత్యము వర్ణశుద్ధియును శబ్దస్థైర్యమున్ మంగళా
స్పదభావంబును రాజయోగ్యతయు దోషస్ఫూర్తిరాహిత్యమున్
సదలంకారవిశేషమున్ గలిగి విశ్వప్రాణసౌభాగ్యసం
పదమై తేజియుఁ బోలి క్రాలవలదా పద్యంబు హృద్యస్థితిన్.
| 110
|
శా. |
సౌరభ్యంబును బంధచాతురగతిన్ శయ్యాచమత్కారశృం
గారంబున్ వివిధార్థముల్ సరససాంగత్యంబు నానాకళా
పారీణత్వము మంజువాగ్విభవమున్ బాంచాలరీతిం దగన్
వారస్త్రీయును బోలె నొప్పవలదా వర్ణింపఁ గావ్యం బిలన్.
| 111
|
చిమ్మపూడి అమరేశ్వరుని విక్రమసేనము
చ. |
చవి యన [4]వేద [5]యామకరసంజ్ఞరసంబు లెఱింగి పానముల్
చవిగొను మాడ్కిఁ గావ్యమును జయ్యన మేలని పోక శబ్దముల్
చెవి ధరియించి యీ రసవిశేషము నెల్ల నెఱింగి మెచ్చు స
త్కవి విని మెచ్చఁజేయునది కావ్యముగాఁ గవియైనవారికిన్.
| 112
|
- ↑ క.యతులు
- ↑ క.పొంతువులు
- ↑ క.శాంతి
- ↑ క.వేగ
- ↑ క.యాన, ట-లో పద్యము లేదు.