తే. |
భారతీహారు భవదూరుఁ బ్రణుతి సేసి
సుకవికులసోము నాచనసోము నెన్ని
నవ్యకవితాసనాథు శ్రీనాథుఁ దలఁచి
సకలసరసాంధ్రకవుల కంజలి యొనర్చి.
| 104
|
జయతరాజు ముమ్మన - విష్ణుకథానిధానము
ఉ. |
పూర్వకవీంద్రులన్ గొలుచు పూనికి నిప్పటివారిఁ గొల్తు ని
ర్గర్వత నిక్కవీంద్రులు పురాణకవీంద్రులకంటె తక్కువే
యుర్విని నేఁటివారగుట యొచ్చెమె నేఁడును దామ్రపర్ణిలోఁ
బూర్వపు ముత్తియంబులను బోలిన మౌక్తికరాజి లేదొకో.
| 105
|
అభినవదండి కేతన – ఆంధ్రభాషాభూషణము
ఉ. |
మెచ్చుఁడు మెచ్చవచ్చునెడ మెచ్చకుఁ డిచ్చకు [1]మెచ్చరానిచో
మెచ్చియు మెచ్చు మ్రింగకుఁడు మెచ్చక మెచ్చితిమంచు [2]గృచ్ఛలై(?)
మెచ్చకుఁ డిచ్చ [3]మెచ్చఁ గని మెచ్చుఁడు మెచ్చొక మానమైనచో
మెచ్చియు మెచ్చకుండ[4]కయ మెచ్చుఁడు సత్కవులార! మ్రొక్కెదన్.
| 106
|
నిశ్శంకుని కొమ్మయ – శివలీలావిలాసము [1-12]
ఉ. |
నన్నయభట్టుఁ గావ్యరచనా[5]విదుఁ దిక్కనసోమయాజి న
చ్ఛిన్నమహత్త్వ సం[6]విదితశేముషి నెఱ్ఱయప్రెగడన్ సము
త్పన్ననవప్రబంధరసభావకు నింపుగఁ బ్రార్థనాంజలుల్
మున్నుగ నాత్మలోఁ దలఁతు మువ్వుర మువ్వురఁ బోలు పుణ్యులన్.
| 107
|
కవిత్వలక్షణము
భైరవుని శ్రీరంగమహత్త్వము [1-14]
సీ. |
శబ్దార్థరూఢి రసస్థితి బహువిధ
వ్యంగ్యభేదములు భావములు గతులు
శయ్య లలంకారసరణులు రీతులుఁ
బరిపాకములు దశప్రాణములును
వరవృత్తజాతులు వస్తువివేకంబుఁ
గవిసమయముఁ జమత్కారములును
వర్ణనంబులు గణవర్ణఫలంబులుఁ
దత్కులంబులు నధిదైవతములు
|
|
- ↑ ట.మెచ్చు
- ↑ ట.గ్రుచ్చలై, త.క్రుచ్ఛలై
- ↑ ట.మెచ్చుట
- ↑ ట.కయు
- ↑ విధి
- ↑ దిదిత