Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పరమపుణ్యులఁగాఁ జేయఁ బఱగినట్టి
హరశిరస్సంగ యదియ పో [యమలగంగ].

157

[1]సంకుసాల సింగయ – కవికర్ణరసాయనము [6-69]

సీ.

బలి[దాతృదాన]సంభవకీర్తి[2]లేఖిక
              మురదైత్యభిత్పదాంబుజమ[ధూళి]
విధికమండలుపయోనిధిసుధారసధార
              జగదం[డఖండక]చ్ఛత్రయష్టి
మదనభేదనశిరోమందారమాలిక
              న[గరసంజీ]వనౌషధిమతల్లి
కనకాద్రిదండసంకలిత[3]కేతనశాటి
              [హారినభోంతర]హారలతిక


తే.

జంభశాసనపురమణిసాలచ[క్ర]
మండలీకృతనిజభోగకుండలీశ
[4]ముచ్యమానవినూ[త్ననిర్మో]కయష్టి
నప్సరల కంతఁ జూ[5]పట్టె నభ్రగంగ.

158

జయ[తరాజు] ముమ్మన – విష్ణుకథానిధానము

ఉ.

ఆడు భవజ్జలంబుఁ [గొని]యాడును నెవ్వఁడు వాఁడు ము[క్తి] దొ
ద్ధాడును బ్రేమతో సరసమాడు హిమాచలకన్యతోడ ము
ద్దాడు గుణాధినాయకుని నాడు మహాద్భుతతాండవంబుఁ [6]జెం
డాడువిధిన్ గృతాంతుఁ దునుమాడు విచిత్రమె జహ్నుకన్యకా.

159

ప్రగడపల్లి – పోతరాజు

మ.

ద్విరదాకారత నెంచి సంతమసరీతిం బర్వి మేఘాకృతిన్
బఱపై శైలధృతిన్ దనర్చిన మహాపాపౌఘముం గిట్టి కే
సరిమాడ్కిన్ రవిభాతి గాడ్పుగతి వజ్రస్ఫూర్తి దారించుచున్
హరి[యించున్] విహరించుఁ ద్రుంచు భవదుద్యద్వారి గోదావరీ.

160

అంగర బసవయ - ఇందుమతీకల్యాణము

శా.

[శ్రీహే]లాపరవిత్తజుం డజుఁడు సూచె న్నర్మదా[వాహిని]న్
సాహిత్యప్రథమానజీవనసరస్సద్గేహినిన్ [దీరరే]
ఖాహంసీబకచక్రవాకపటుపక్షక్షేపసం(జాత)వా
తాహత్యుచ్ఛల్లితాంబుపాంశపటువ్యా(కీర్ణస)మ్మోహినిన్.

161
  1. సుంకసాల
  2. చ.రేఖక
  3. చ.దిమ్మరిస
  4. చ.మత్స్యమాన
  5. చ.పట్టి
  6. చ.చుద్దౌడు