Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యోగీంద్రహృదయాను[1]రాగంబు వేగంబు
              వసుధదుర్మతికి నావళ్ళు సుళ్ళు
సురపథప్రాప్తికిఁ దెరువులు నురువులు
              ఇహపరంబుల కుప్ప యిసుకతిప్ప


తే.

యంబురాశిసమాలింగనానుషంగ
విప్రనిగమోత్తమత్రితంత్రప్రసంగ
+ + + + ద కారణజటవిహంగ
గౌతమీగంగఁ గాంచె [క్ష్మానేత య]పుడు.

155

[?]

సీ.

+ + + +ణసౌఖ్యసారంబు
              త్రైలోక్యసుఖకల్ప[తరులు ద]రులు
ధర్మార్థకామసంధానంబు ఫేనంబు
              [స్థిర]పుణ్యమార్గవైఖరులు తిరులు
బహుతాపత్ర[యశృంగభం]గముల్ భంగముల్
              ఘోరపాపౌఘసంహారి వారి
 + +షమార్గణగణములు కన్యామణులు
              ప్రకటవై[కుంఠవై]భవము భవము


తే.

కఠినతరరోగజాలంబుఁ గాఁచు [నాచు]
కాలమృత్యువు కొమ్ముతో గసికె యిసికె
[నీకు సరి]గాఁగ నదులు వర్ణింపఁగలవె
జాహ్నవీగంగ! సర్వలక్షణశుభాంగ!

156

పెదపాటి సోమయ – కేదారఖండము

సీ.

భవ్యులకును మోక్షభవనంబు [2]భువనంబు
              కపటాత్ములకు గుచ్చు గసికె యిసికి
తద్జ్ఞులకును గల్పతరువులు నురువులు
              ఖలులకుఁ జొరరాని [3]గళ్ళు సుళ్ళు
ధీరులఁ గడతేర్చు తెప్పలు తిప్పలు
              పాపకర్ముల కతిభయము రయము
సభ్యుల కాధారసారంబు తీరంబు
              మలినాత్ములకు మహామాయ ఛాయ


తే.

యనఁగఁ బఱగియుఁ దన వారి యంద మొంద
సాధువులు నైన నత్యంతశఠులు నైన

  1. చ.రాగులు
  2. చ.భవనంబు
  3. చ.దళ్ళు