|
జ్జ్వలసాదాంబుజరత్న[నూపుర]చల[1]ద్వాద్యంబు [2]పెంపొంద వా
గ్జలజాతాక్షి యొనర్చు నా హృదయరంగక్షోణి నృత్యక్రియన్.
| 72
|
[3]మడికి సింగన – పద్మపురాణము – ఉత్తరఖండము
చ. |
అమృతము వంటి కాంతి కమలాసను పట్టపుదేవి వేదశా
స్త్రముల విహారభూమి కల ప్రాణుల కెల్లను బల్కుదోడు వి
శ్వమున సమస్తవిద్యల విశారద శారద నాదు వక్త్రప
ద్మమున వసించి మత్కృతిఁ జమత్కృతి పుట్టఁగఁ జేయుఁగావుతన్.
| 73
|
చిమ్మపూడి అమరేశ్వరుఁడు - విక్రమసేనము
చ. |
చదువుచునున్నవే చిలుకచాయ నురస్స్థలరాగదీధితుల్
పొదవిన సాంధ్యరాగరుచిఁ బొందిన యిందుని కాంతిఁ బోలు సొం
పెద యలరంగఁ జొచ్చి సుఖియించు శుకాంచితపాణి వాణి మ
ద్వదనకు శేశయానననివాసినియై విలసించుచుండెడున్.[4]
| 74
|
[5]మడికి సింగన – పద్మపురాణము – ఉత్తరఖండము
ఉ. |
వాడని తమ్మిచూలి తలవాకిటఁ గాపురముండు దేవి నీ
రేడు జగంబులుం దనకు నిమ్మగు వేడుకఁ బొమ్మరిండ్లుగా
నాడెడు కన్య విప్రులకు నాశ్రయమయ్యెడి పల్కుచేడె వా
దోడగుఁగాక మాకుఁ గృతిఁ దూకొను నిశ్చలవాక్యసిద్ధికిన్.
| 75
|
ఎఱ్ఱన – అరణ్యపర్వము[6] [4-216]
ఉ. |
అంబ నవాంబుజోజ్జ్వలకరాంబుజ శారదచంద్రచంద్రికా
డంబరచారుమూర్తి వికటస్ఫుటభూషణదీప్తదీపికా
చుంబితదిగ్విభాగ [7]శ్రుతిసూక్తవివిక్తనిజప్రభావ భా
వాంబరవీథివిశ్రుతవిహార ననుం గృపఁజూడు భారతీ.
| 76
|
వినాయకస్తుతి
పెద్దపాటిసోమరాజు - అరుణాచలపురాణము
ఉ. |
తారకజిచ్చిఖండి శివతాండవమాడిన తండు మర్దలా
ధారరవంబు మేఘునినదంబని చేరినఁ జూచి నాసికా
ద్వారబిలంబు జన్నిదపువ్యాళము చొచ్చినఁ దొండమెత్తి ఘీం
కారము సేసి నవ్వు వెనకయ్య కృతీశ్వరు మన్చుఁగావుతన్.
| 77
|
- ↑ ట.వాక్యంబు
- ↑ ట.సొంపొంద
- ↑ అయ్యలార్యుని
- ↑ ట.లేదు
- ↑ అయ్యలార్యుని
- ↑ క.నన్నయభట్టు – ఆదిపర్వము
- ↑ క.పదహస్త