|
[1]చండభుజాదండదండధరస్ఫూర్తి
కిరిఘోర[మూర్తిఁ బర]గెనొక్కొ
|
|
తే. |
యనఁగ నతిభీకరాకారమైన యట్టి
యేకలం బెల్ల[యెడలను నె]దురు లేక
ఘోరసత్త్వసమగ్రకాంతారజలధి
దిరుగుచు[న్నది మం]దరగిరియుఁ బోలె.
| 129
|
వేటవర్ణన
జక్కన – సాహసాంకము [2-123]
సీ. |
[తలమీఁదఁ] జెరివినఁ దనరారు నునుఁ[2]డెంక
యమృతాంశురేఖచందమున నమర
మేదినీరేణువు మెయి నిండఁగాఁ బర్వి
భసితాంగరాగసంపద వహింప
జుంజువెండ్రుక [3]లెత్తి చుట్టిన లేఁదీఁగె
పన్నగాధీశ్వరు[4]పగిది మెఱయఁ
గరమొప్పు నుదిటిపై గైరికతిలకంబు
ఫాలలోచను భాతిఁ బరఁగుచుండ
|
|
తే. |
శబరుఁ డొక్కరుఁ డేతెంచె సంభ్రమమున
శంకరుఁడు తొల్లి శబరవేషము ధరించె
నంచు మదిలోన నీసుఁ దలంచి తాను
నీశు నాకృతిఁ గైకొన్న యెఱు కనంగ.
| 130
|
చిమ్మపూడి అమరేశ్వరుఁడు - విక్రమసేనము
సీ. |
ఇది నెలలో నున్న యిఱ్ఱినైనను దాల్చు
నట్టి నేర్పున భాజిఁ బట్టు దేవ
బట్ట [5]వైచిన ముట్టి బలువున నిది దివిఁ
బాఱి చంపును సాళువంబు దేవ
యిది వాజి విచ్చిన యది సన్నకౌ నొంది
యెలయించుఁ గక్కెరపులుగు దేవ
యిల నిది తూమెడు తలలకుఁ బొరగాని
నిజ గరి[?]యైన కైరవము దేవ
|
|
ఆ. |
దేవదేవ నీకుఁ దెచ్చితినని చెప్పి
యిచ్చి నిలిచి మ్రొక్కి యెదురనున్న
|
|
- ↑ చ.దండధరోద్దండ
- ↑ చ.బిక
- ↑ చ.లొత్తి
- ↑ చ.భంగి నమర
- ↑ చ.గైచిన