Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


              గావులు సతినీలు గర్భసుఖులు
మేఘవన్నియలు లక్ష్మీవిలాసములు కం
              టకగుబ్జగలును నందనవనాలు


తే.

మండలాచరణంబులు నిండు జంత్రి
కలు చలారులు షీటులు కారికములు
తోరహస్తుకకలంభీలు దుప్పటములు
కటితలంబుల నొప్పుగాఁ గట్టుకొనిరి.

105

భూషణములు

అంగర బసవయ – ఇందుమతీకల్యాణము

సీ.

[1]బబ్బిలికాయలు బంగారుమొగులుపి
              ల్లాండ్లు మట్టియలు బాదాంగకముల
మొలనూళ్ళు కంకణంబులు వీరముద్రిక
              లంగుళీయకములు హారతతులు
కేయూరములు భుజకీర్తులు తవసాలు
              కట్టాణిముత్యాల కంటసరులు
సూడిగంబులు చేరుచుక్కలు బవిరెలు
              గుబ్బసరంబులు కుండలములు


తే.

ముంగరయు బన్నసరములు మొలపుతీఁగె
లల్లిపువ్వులు పతకంబు లంజికట్లు
[2]చేకటలు నాఁగ వడిగెలు చెవుల పువ్వు
లవయంబులఁ దాల్చిరి యమరఁగాను.

106

[3]సంకుసాల సింగయ – కవికర్ణరసాయనము [4-61]

చ.

స్మర[4]పరిదత్తహస్తములు సర్వసమీక్షణభాగధేయముల్
తరుణిమరత్న[5]సానువులు దర్పకదర్పలతావసంతముల్
వరహృదయానురాగరసవార్థి[6]వివర్ధనపూర్ణచంద్రమః
కరములు వేడ్కఁ గైకొనిరి కాంత లలంకరణంబు లయ్యెడన్.

107
  1. చ.బొబ్బిలి
  2. చ.చేవటలు
  3. సుంకిసాల
  4. చ.పతి
  5. చ.శోణిలువితంక్రియలంగులతావసంతముల్
  6. చ.నివర్ణన