మాదయగారి మల్లయ - రాజశేఖరచరిత [2-157]
తే. |
[1]పదువు రొక్కటియై యొక్కపడఁతిఁ దఱుమ
నిలువుటీఁతలఁ బాఱెడు నీలవేణి
తోఁచె హిమరోచి పెక్కుమూర్తులు ధరించి
రాఁదలంకుచుఁ బాఱెడి రాహు వనఁగ.
| 102
|
చరిగొండ ధర్మయ – చిత్రభారతము [3-12]
సీ. |
అంగుష్ఠములు [2]ముట్టి యంఘ్రితలంబులఁ
జెంది గుల్భంబుల నంది [3]యూరు
వులఁ జేరి జఘనస్థలు[లు] సోఁకి నాభిరం
ధ్రములను [4]సుడిసి పక్షముల నూఁది
చన్నులు [పట్టి] కక్షంబుల నొరసి కం
ఠములు నిమిరి కపోలములు పుణికి
యధరంబు లాని నయనముల నొరసి ఫా
లములఁ జుంబించి శీర్షముల నంటి
|
|
తే. |
క్రమము మీఱఁగ నిరతాభిరతి దలిర్పఁ
గళల నెలవులు పరికించు కాంతు లనఁగఁ
జాలి నీరజపత్రలోచనలనెల్ల
సారసామోదయుతసరోజలము లలమె.
| 103
|
వస్త్రములు
[5]సంకుసాల సింగన – కవికర్ణరసాయనము [4-60]
తే. |
బహురసార్ద్రతఁ దము నంటి పాయలేని
వసనములు [6]డించి సతులు నీరసములైన
క్రొత్తమడుఁగులు వేడ్కఁ గైకొనిరి యహహ
ప్రియముఁ గైకోరు నూతనప్రియలు సతులు.
| 104
|
అంగర బసవయ - ఇందుమతీకల్యాణము
సీ. |
బొమ్మంచులువ్వంగమలు గజపొప్పళ్ళు
జిలుగుఁ జెంగావులు చిలుకచాళ్ళు
వలిపెంపు లెడమధావళములు ముత్యాల
పందిళ్ళు వోజులు పచ్చబట్లు
గుళ్ళకాపులు చిత్రకోలాటములు గంధ
|
|
- ↑ చ.పలువు
- ↑ చ.పుట్టి
- ↑ చ.జాను
- ↑ చ.సుదినక్షత్రముల
- ↑ సుంకిసాల
- ↑ చ.జించి