Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెదలువాడ యెఱ్ఱాప్రగడ - నృసింహపురాణము [2-68]

చ.

వలి [1]విరవాది క్రొవ్విరుల వాతుల మూతులు వెట్టి తేనియల్
కొలఁదికి మీరఁ గ్రోలికొని క్రొవ్వున [2]జివ్వల నీన నొక్కమై
దలముగ [3]దీటు గట్టుకొని దాఁటెడు తేఁటుల చైది నెల్లచోఁ
గలయఁగ వృక్షవాటికలఁ గ్రమ్మె న[4]కాలతమోనికాయముల్.

82

భైరవుఁడు – శ్రీరంగమహత్త్వము [2-46]

చ.

అరవిరి కమ్మఁ దమ్మి విరు లందుట నెందును సోడుముట్ట న
బ్బురముగ [5]నుబ్బు మేలివలపుల్ [6]పసిఁగొంచు మూఁగిలో
గుఱువులు [7]వాఱి కర్ణికలఁ గొందుల వాచవు లూరు తేనె ము
మ్మరముగఁ [8]గ్రోలి యన్నుకొని మానక ఝమ్మని మ్రోసెఁ దుమ్మెదల్.

83

చరిగొండ ధర్మయ – చిత్రభారతము [2-107]

తే.

భూరిమధుపానమునఁ [9]జొక్కి పుష్పరేణు
పటలి భూతిగఁ దాల్చి నేర్పరితనమున
ఝంకృతులు శృంగనాదంబు జాడ గాఁగఁ
దుమ్మెదల పిండు మించె సిద్ధుల విధమున

84

కోకిలవర్ణన

పొన్నాడ పెద్దిరాజు - ప్రద్యుమ్నచరిత

సీ.

భామినీసమితికిఁ బంచమస్వరముల
              బాగులు నూచు నేర్పరు లనంగ
విటవీటిజనులకు వినమ్రోసి మన్మథా
              వేశంబుఁ గావించు వెజ్జు లనఁగ
విరహిబృందములకుఁ బొరి నుల్కు పుట్టించు
              గొఱతెడు మరు వెఱగొంగ లనఁగ
నిల వసంతునికి మిక్కిలి సొంపు గలిగింపఁ
              డాలైన యట్టి చుట్టము లనంగ


తే.

సొగసి తలిరుల వాచవిఁ జూచి చూచి
పక్వసహకారఫలరస[10]పాయు లగుచు
ధరఁ బురారామపాదపవరులు కాఁపు
లున్న కోకిలదంపతు లుల్లసిల్ల.

85
  1. చ.విరివాటి
  2. చ.నివ్వల
  3. చ.ధాటు గు
  4. చ.కోయ
  5. చ.మెరి
  6. చ.వడి
  7. చ.జారి
  8. చ.యెన్న
  9. చ.జొచ్చి
  10. చ.పాను