Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఘుర్ఘరధ్వానడిండిమాఖండనినద
మభినవంబైన యా జలదాగమమున.

24

భైరవుఁడు – శ్రీరంగ[1]మహత్త్వము [2-26]

మ.

జల[2]దాటోపవిశాల మింద్రధను[3]రంచద్వారుణీకూల ము
త్కలికాలంబకదంబసాల[4]వనమధ్యస్ఫారసవ్యావలీ
కలనా[5]వాల ముదారకేతకపరాగ[6]వ్యాళ ముర్వీధర
స్థలనృత్యన్మదకేకిజాల మగు వర్షాకాల మొప్పెం [7]గడున్.

25

బమ్మెర పోతరాజు – దశమస్కంధము - పూర్వభాగము [754]

సీ.

పూర్వవాయువులు ప్రభూతంబులై వీచెఁ
              బడమట నింద్రచాపంబు దోఁచెఁ
బరివేషయుక్తమై భానుమండల మొప్పె
              మెఱపు లుత్తరదిశ మెఱవఁ దొణఁగె
దక్షిణగాములై తనరె మేఘంబులు
              జలచరానీకంబు సంతసించెఁ
[జాత]కంబుల పిపాసలు కడపలఁ జేరెఁ
              గాంతారవహుల గర్వ మణఁగె


ఆ.

నిజకరాళివలన నీరజబంధుండు
దొల్లి పుచ్చుకున్న తోయ మెల్ల
మరల నిచ్చుచుండె మహిఁ గర్షకానంద
కందమైన వాన కందు వందు.

26

శరదృతువు

పెద్దిరాజు – అలంకారము [3-105]

క.

వెన్నెల యింపును జుక్కల
చెన్నును దెలుపారు దిశల చెలువంబులు వి
చ్ఛిన్నములగు జలదంబుల
సన్నుతి సేయంగవలయు శారదవేళన్.

27


శా.

సోమశ్రీలకు వన్నెవెట్టుచు వనస్తోమంబునం [8]బర్వునా
శామాలిన్యమునేలఁ ద్రోచు [9]నవరాజద్రాజహంసావళిన్
బ్రేమంబున్ [10]బచరించు మానసమునన్ బెంపై శరద్విభ్రమం
బామోదప్రదమైన విశ్వ[11]విభు నుద్యత్కీర్తికిన్ సాటియై.

28
  1. మాహాత్మ్యము
  2. చ.జాంతో
  3. చ.రంభ
  4. చ.ఘనపద్యా
  5. చ.వాత
  6. చ.శ్రీల ను
  7. చ.దగన్
  8. చ.బర్ప
  9. చ.నత
  10. చ.బ్రసరించు
  11. చ.విధు