Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[1]సంకుసాల సింగయ – కవికర్ణరసాయనము [6-11]

ఉ.

చాతకభాగ్యరేఖ జలజాతపరిచ్యుతి పక్వకందళీ
సూతి చికిత్సకాంగన ప్రసూనశరాసనరాజ్యలక్ష్మి ప్ర
ద్యోతనచంద్రమఃపటు[2]విధుంతుదభీషకసర్వజీవజీ
వాతువు గాననయ్యె [3]నవవారిధరోదయవేళ [4]యయ్యెడన్.

20

[6-20]

ఉ.

క్రూరతటిత్కృపాణ[5]తతిరూఢబలాక[6]కపాలమాలికా
హారిణి నిర్నివారణవిహారిణి [7]కాళిక [8]కాళికాగతిన్
దారుణ[9]లీలమై భువనదాహకుఁడైన నిదాఘదైత్యు నం
భోరుహమిత్రు పేరి తలఁ బుచ్చుక మ్రింగె విచిత్రవైఖరిన్.

21

నంది మల్లయ - మదనసేనము

తే.

వర్షధారలు పన్నగావళులు గాఁగ
బ్రబలు మెఱుపులు తన్మణిప్రభలు గాఁగ
భానుశుభ్రాంశుకాంతులు గాన రాక
యుండె రోదసి పాతాళమో యనంగ.

22

పెద్దిరాజు - ప్రద్యుమ్నచరిత

మ.

లుఠితాశారవితాంతరంబు చపలాలోకప్రభాసంజ్ఞలున్
జఠరా[10]సహ్య[11]గిరాంవికారమును భూషావేషముం ధూర్తుక
ర్మఠవృత్తంబుగ దుర్దినావళి సుదూరస్ధంబు చేసె న్మహా
శఠముం బోలెఁ గుముద్వతీకమలినీచంద్రార్కలీలన్ [వెసన్.]

23


సీ.

కలయంగ వనవాటికలఁ [12]జోడుముట్టుచు
              కొండమ[ల్లియ] తావి గుబులుకొనియెఁ
బురివిచ్చి పంచమస్ఫుటనాదములతోడ
              నర్తించి గిరులెక్కె [13]నమలిపిండు
దిశల నెఱ్ఱనిఛాయఁ దిలకింపఁగాఁ జేసెఁ
              గణపమ్రాఁకుల కోరకముల సొబగు
విరహమానసములు వేగదొడఁగఁ జల్లి
              [14]కఱ్ఱ గైకొనెఁ దూర్పుగంధవహుఁడు


తే.

చెలగె నెడనెడ [15]నాభీలసలిలపూర
విహరణోద్దండమండూకవీతకంధ

  1. సుంకసాల
  2. చ.విధూత్తభిషేకము
  3. చ.నున
  4. చ.యంతయున్
  5. చ.పరి
  6. చ.కపోల
  7. చ.కారిక
  8. చ.కానికా
  9. చ.లీనమై
  10. చ.నమ్య
  11. చ.గిరిం
  12. బోదు ముట్టించు
  13. చ.నెమలి
  14. చ.కద్రు
  15. చ.నాపెలు