Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[?]

ఉ.

చుక్కల నెయ్యపుందగవు సూచిన యామిని కూర్మిసూచినన్
జక్కన నాథు దీనతకుఁ జాలక మున్కడు నస్తమించె న
మ్మక్క! శిలావిశేషముగదా శశియశ్మము నీలరోచి గా
దొక్కొ కలంక నొల్లనని యోర్చెఁ దదీయవియోగదుఃఖమున్.

234

అరుణోదయము

తులసి బస్వయ - సావిత్రికథ

మ.

అరవిందప్రియవాది ఘోరతిమిరవ్యాళవ్రజస్ఫూర్తికిన్
గరుడుం డంచితదిక్సతీకుచతటీకాశ్మీరపంకంబు పు
ష్కరభాగా[1]టవికాగ్రపల్లవితమాకందంబు మందప్రభల్
బెరయం దూర్పునఁ [2]గుంటివేల్పు వొడసూపెన్ దపదండాకృతిన్.

235

శ్రీనాథుఁడు - కాశీఖండము [1-121]

సీ.

చిఱుసానఁ బట్టించి చికిలి సేయించిన
              గండ్రగొడ్డలి నిశాగహనలతకుఁ
గార్కొన్న నిబిడాంధకారధారాచ్ఛటా
              సత్రవాటికి వీతిహోత్రజిహ్వ
నక్షత్రకుముదకాననము గిల్లెడు [3]బోటి
              ప్రాచి యెత్తిన హస్తపల్లవాగ్ర
మరసి మింటికి మంటి కైక్యసందేహంబు
              పరిహరింపఁగఁ బాల్పడ్డ యవధి


తే.

సృష్టి [4]కందెర దొలుసంజ చెలిమికాఁడు
కుంటి వినతామహాదేవి కొండుకుఁగుఱ్ఱ
సవితృసారథి [5]కట్టెఱ్ఱ చాయఁ దేలు
నరుణుఁ డుదయించెఁ బ్రాగ్దిశాభ్యంతరమున.

236

వేఁగుఁదెమ్మెరలు

ముక్కు తిమ్మన – పారిజాతము [2-62]

మ.

సమయాభీరకుమారుఁ డేపునఁ దమిస్రారూపనక్తంచరిం
గమలద్వేషణమండలీకుచగళత్కాంతిచ్ఛటాదుగ్ధపూ
రముతో రూపఱఁజేయ శోషిలుచుఁ దార ల్సోల నిట్టూర్పు సాం
ద్రముగా నూర్చె ననంగఁ బొల్పమరఁ బ్రాతఃకాల[6]వాతూలికల్‌.

237
  1. చ.టవిధా
  2. చ.గుంటు
  3. క.పొడి, గ.పాండి
  4. క.కంటెఱ్ఱ, గ.కంటెర్ర
  5. గ.సందెర్ర
  6. క.వాతూలముల్