Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[?]

క.

అంత నిశాసతి [1]ముదిసిన
నెంతయు లోఁగుంది కుంది యిందుఁడు చింతా
క్రాంతుండై కుముదంబులు
సంతాపముఁ బొంద నపరజలధికిఁ జనియెన్.

229

బొడ్డపాటి పేరయ – శంకరవిజయము

చ.

తన రుచిగానివేళ బెడిదంబగు [2]దేజుఁ డినుండు దోఁచినన్
గనుమొఱఁగుంట రాజునకుఁ గర్జ మటం చెటయేనిఁ జన్నయ
ట్లనుచరులై వెలింగెడి గ్రహంబులుఁ దారలుఁ దోడ రాఁగ వే
గన చనె [3]వెల్లివెల్లని మొగంబు కళంకమున్ శశాంకుఁడున్.

230

తారాస్తమానము

చెదలువాడ యెఱ్ఱాప్రగడ - నృసింహపురాణము [3-109]

ఉ.

చల్లనివాఁడు గావున నిశాచరు ప్రాపున [4]దీప్తి లీలమై
నెల్లజగంబులన్ మిలిగి [5]యిమ్ములనుండితి మింక నెంతయున్
దెల్లము తీవ్రమూర్తి యొరుతేజము సైపడు భానుఁ గూడి న
ర్తిల్లఁగ వచ్చునే యను గతిన్ దివిఁ జుక్క లడంగెఁ దోడుతోన్.

231

అయిలన యుద్ధకాండశేషము

చ.

వెలయఁ గళాఢ్యుఁడైన శశి వేడుకఁజేయు [6]రతోత్సవంబునన్
లలితరుచిస్ఫురద్గగనలక్ష్మిమనోహరహారమౌక్తికం
బులక్రియ నున్న తారకలు పూర్వసురాధిపు భాగ్యచిహ్నముల్
దొలఁగినమాడ్కి దృష్టిపథదూరము లయ్యెఁ గ్రమక్రమంబునన్.

232

శ్రీనాథుఁడు - శృంగారనైషధము [8-16]

చ.

తటికున నస్తిమించెఁ బతి దైన్యముఁ జూడఁగ నోడి తారకా
పటలమునుం ద్రియామయును బాపురె యింతుల వాఁడిపంతముల్
గటకట! తద్వియోగమునఁ గ్రాఁగి నశింపఁడె నిష్ఠురాత్ముఁడై
పటికమొకో విధుండు నడుపట్టుకలంకము నల్లగారయో.

233
  1. గ.మురిశిన
  2. క.చ.వేఁడి
  3. గ.పిల్లనయ్యన
  4. క.గ.దీప్తలీలమై
  5. గ.నెమ్మిని
  6. క.రతోత్తరంబునన్