Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మొదల భయముగ [1]జనుఁబట్టి వదలరైరి
వీథు లరికట్టి పురిఁ[2]గొట్టి వేశ్య లపుడు.

119

[4-95]

[3]సీ.

చిటికలు వేయుచుఁ జిఱుపాటఁ బాడుచుఁ
              జార్చి పయ్యెద గూడఁ జేర్చుకొనుచుఁ
గన్న రూపములెల్ల గరసంజ్ఞఁ బిలుచుచు
              నెటకైనఁ జనువాని కెదురు సనుచు
గడచిపోవచ్చినఁ గౌఁగిఁటఁ బట్టి నీ
              వాయంచు వదలి మోహంబు రేఁచి
[4]చూపిన వెలకు నంతే పో యనుచుఁ జిక్క
              వ్రేయుచు రోయుచు వెంటఁబడుచు


తే.

రూక లడుగుచుఁ దుదిఁ బచ్చనాకు కైన
నొడఁబడుచు హస్తగతమైన నొడియ నడచి
దొడ్డ బండాటమునఁ గోఁకఁ ద్రోసికొనుచు
గుడిసెలంజలు తెరవాటు గొట్టి రపుడు.

120

వీటినాటకము [క్రీడాభిరామము - 68]

[5]సీ.

ఎకసక్కెముగ నాడు నేదైన నొకమాట
              పాడు నొయ్యన పాట పాటపాట
యలఁతి యద్దపుబిళ్ళ యలవోక వీక్షించుఁ
              గొనగోరఁ బదనిచ్చి కురులు దీర్చుఁ
బయ్యెద దిగఁజార్చి పాలిండ్లు పచరించు
              దిస్సువాఱఁగ నవ్వుఁ దీఁగెనవ్వు
ధవళతాళపలాశతాటంకములు ద్రిప్పు
              కలికిచూపులఁ జూపు గర్వరేఖ


తే.

కటకుటీద్వారవేదికాకాష్టపీఠ
[6]మధ్యభాగనిషణ్ణయై మదము మిగిలి
వీటి పామరవిటుల తంగేటిజున్ను
కాము బరిగోల మేదరి కరణవేశ్య.

121
  1. క.పెనుబటి, గ.బలుబట్టి
  2. క.కుటి, గ.గుట్టి, ము.గట్టి
  3. క-లో లేదు.
  4. గ.చూచినపలుకు
  5. క-లో లేదు.
  6. గ.మద్యపానవిషణ్ణయై