[1]క. |
కులశీలంబులు వదలక
యిలు మఱువక పనులయందు నేమఱక పయిన్
బలుపులు చల్లిన బ్రమయక
మెలగంగా నేర్చువాఁడె మిండఁడు జగతిన్.
| 106
|
[2]చ. |
కలఁగఁడు దీరబుంగళము గట్టఁడు ముప్పలు చూడఁ డుబ్బునన్
జెలఁగఁడు రిత్తచందములు సేయఁడు పెల్లుగఁ జాల మత్తుఁడై
పలుకఁడు మేనఁ జెన్ను గల పట్టుల చూపెడు నవ్విటుండు మిం
చులనఁగ మంచిసుందరుల చూపులు పైపయిఁ బాఱుతెంచినన్.
| 107
|
[3]సీ. |
డిచ్చంబు పట్టక తుచ్ఛాలు పలుకక
యెమ్మెలఁ బొరలక యెఱుక చెడక
తఱు చుల్క సేయక తబ్బిబ్బులాడక
వెలనాడి తప్పక వేసరిలక
గలిగలి కర్మాక[?] కంటసాలాడక
గ్రొంద్రతి[?] గూడక గుణము చరక[?]
తనవారి మఱువక ధర్మంబుఁ దప్పక
పలుమాఱు గప్పరవాటు పడక
|
|
తే. |
వట్టి దొగడౌలు సేయక వరుస గలిగి
దిట్టతనమున మదిలోన గుట్టుతోడి
జరుపనేర్చినవాఁడు వో చండవిటుఁడు
+ + + + + +.
| 108
|
విటశృంగారము
కూచిరాజు యెఱ్ఱన – కొక్కోకము
సీ. |
పొగ కంపు [4]నలవక మిగులు వెచ్చనగాక
[5]తెలుపైన [6]నీటను జలకమాడి
[7]కమరు వలువకయుఁ గాక [8]పిప్పియుఁ గాక
మృదువైన గంధంబు మేన నలఁది
గడితంబు [9]జిలుగును గాక [10]రవణమైన
పంచెపై వలిపదుప్పటమ్ముఁ గట్టి
చెమ్మ వల్వక వన్నె బెదరక వాసనఁ
[11]గులుకు పువ్వులు దోఁపి కొప్పు ముడిచి
|
|
- ↑ క.లో లేదు.
- ↑ క.లో లేదు.
- ↑ క.లో లేదు.
- ↑ క.వలువక, చ.గలుగక
- ↑ చ.తెలివైన
- ↑ క.వీరుల, గ.నీరున
- ↑ క.కమరు వలువకనుగాక, గ.నొకమారు వలువకనున్న, చ.కరము పల్చననున్నఁగాక
- ↑ గ.వాపియు
- ↑ గ్రంథపాతము
- ↑ గ.గ్రంథపాతము క.రవడుగైన, చ.రవడుసైవ(?)
- ↑ క.గలుగు