Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[4-72]

ఉ.

కుత్తుక లెత్తి బిట్టులికి క్రుంకు రవిం గని దీనవృత్తితో
నొత్తిన [1]భావిదుర్భరవియోగభరంబున నొండొకంటి [మో]
మత్తమిలం గనుంగొను రథాంగయుగంబుల దృష్టిఁ గప్పఁబో
[2]మిత్తుగఁ గన్ను నీ రొదవి మించని చీఁకటికంటె ముందఱన్.

103

విటవిడంబనము

[3]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [4-77]

సీ.

కలపంబు లొనఁ గూర్చు గన్యకాజనముల
              రమణీయ[మణి]కంకణముల రవళి
ప్రియులఁ దోతెమ్మన్నఁ బిలిచి తే నరుగు చే
              టికల [4]నున్గులుకు మట్టియల యులివు
నడియాస [5]జోకొట్టు [6]నొడికంపుటల్లుండ్ర
              దఱిమి పోనాడు నత్తల యదల్పు
కైసేఁతల నొసంగు కమ్మఁదావుల సోలు
              నెలదేఁటి నిసుగు[7]ల యించుమ్రోఁత


తే.

కలుపుబావల రాక యక్కలకు నెఱుఁగఁ
బలుకు చిలుకల కల్కి పల్కులును గలసి
మరుఁడు విడిసిన దండు సంభ్రమము వోలెఁ
గలకలితమయ్యె గణికానికాయవాటి.

104

విటలక్షణము[8]

కళావిలాసము

క.

శ్రీమంతుఁడు గుణవంతుఁడు
ధీమంతుఁడు రూపయుతుఁడు ధీరుండు కళా
ధాముండును గావలయును
[9]దా మహిఁ గాముకుఁడు కామతంత్రవివేకీ.

105
  1. క.బారి
  2. క.మిత్తుగు, చ.మెత్తుగ
  3. సుంకిసాల
  4. క.పలుకులకు
  5. క.జెక్కొట్టి
  6. క.నవచంపల
  7. క.నించు
  8. ఇటనుండి గ-ప్రతి ఆధారము.
  9. క.(దా)మహికాముండు, చ.దామహిఁగాముండు