నంది తిమ్మన – పారిజాతము [2-32]
చ. |
తనువున [1]నంధకారపుమదం [2]బల మిన్నను భద్రదంతికి
న్మొనసినఁ జింద రేఁగి తపనుండను మావుతుఁ [3]గ్రుంకుమెట్టలో
య నురలవైచినన్ నొగిలి యచ్చట నెత్తురు గ్రక్కెనో యనన్
గనుఁగవ గోరగింపఁ బొడకట్టె సముజ్జ్వలసాంధ్యరాగముల్.
| 79
|
శ్రీనాథుఁడు – భీమఖండము [2-30]
తే. |
సంజకెంపును దిమిరపుంజంపునలుపు
[4]గమిచి బ్రహ్మాండభాండంబు గరము మెఱసెఁ
బరమపరిపాకదశ [5]వృంతబంధ మెడలి
[6]పతనమగు తాటిపంటితోఁ బ్రతిఘటించి.
| 80
|
శా. |
ఆకాశాంచలవీథుల న్నెగడె సంధ్యారాగ[7]రేఖా[వళుల్]
[8]పాకోన్మిద్రితపారిభద్రకళికాపాండిత్యవైతండికో
త్యేక[9]స్ఫూర్జితచండతాండవరయోద్రేకారభట్యుద్భుట
శ్రీకంఠస్థిరదీర్ఘపాటలజటాశ్రేణిన్ విడంబించుచున్.
| 81
|
చరిగొండ ధర్మయ – చిత్రభారతము [6-107]
క. |
సగపాలు సాంధ్యరాగము
నిగిడినఁ గెంజాయఁ దనరి నెఱ చీఁకటిచే
సగపాలు నలుపు నొందుచు
గగనము గురివెందగింజ కైవడిఁ బొల్చెన్.
| 82
|
పిల్లలమఱ్ఱి వీరయ – శాకుంతలము [3-149]
మ. |
[10]మునిదత్తార్ఘ్యపయః[11]ప్రహారకులిశంబుల్ [12]దాఁకి మందేహదే
హనితాంతస్రుతరక్తధార చెలువంబై పశ్చిమాశాతటిం
గనుపట్టెన్ నెఱసంజ చాయ యనుచున్ గాంక్షించి యచ్చోటికిన్
జను కాకోలకులంబు నా దెసల నోజన్ జీఁకటుల్ గ్రమ్మఁగన్.
| 83
|
తులసి బసవయ్య - సావిత్రికథ
క. |
మందేహదేహదహనా
మందక్షతజప్రవాహమహనీయనదీ
|
|
- ↑ క.సాంధ్యరాగము
- ↑ క.బులవిన్నను
- ↑ క.గ్రుంగఁబెట్టి
- ↑ క.గలసి
- ↑ క.వృత
- ↑ క.ప్రబల
- ↑ క.శాఖా
- ↑ క.పాకున్మేడ్రిత
- ↑ క.స్ఫూర్తిప్రచండ
- ↑ క.మునిదత్తాఖ్య
- ↑ క.ప్రపూర
- ↑ క.కాంతి