Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సాంధ్యరాగము

భావన పెమ్మన - అనిరుద్ధచరిత్ర

సీ.

వరుణుని శృంగారవనములో [1]బెగడొందు
              పగడంపుఁదీఁగెల ప్రాఁ కనంగ
జరమభూధరముపై సురగాలి నెగయింప
              దోతెంచు [జేగురు]ధూళి యనఁగ
నస్తాంబురాశిలో నంతకంతకుఁ గ్రాలు
              బాడబానలశిఖాపటల మనఁగ
నినురాక కపరదిగ్వనిత [2]యెత్తించిన
              రత్నతోరణవిభారాజి యనఁగ


తే.

విరియ నుంకించు [3]చెందొవవిరులయందు
వఱలు ఱేకులకాంతికి వన్నె వెట్టి
రమణ రమణీజనానురాగములతోడ
నిగిడి యెఱసంజ పడమట నివ్వటిల్లె.

75

[4]శాకల్య అయ్యలార్యుఁడు – యుద్ధకాండము [2637]

చ.

తరువులయందుఁ బల్లవపదస్థితి నద్రులయందు [5]ధాతుబం
ధురగతి నంగనాజనపృథుస్తనమండలిఁ గుంకుమంబునై
పరఁగుచు [6]సాంధ్యశోణిమవిభాసురమై జలనాథదిక్తట
ద్విరదము కుంభి[7]సంభవనవీనగళ[8]ద్రుధిరంబు నాఁ దగన్.

76

[9]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [4-81]

క.

ఇనుఁ డేగుచుఁ జీఁకటి వెను
కొను శం[కం] గావు వెట్టికొనిపోయిన య
త్యనురక్తికిరణబలమో
యన [10]సంధ్యారాగ మొదవె నపు డపరదిశన్.

77

తెనాలి రామలింగన్న – హరిలీలావిలాసము

ఉ.

[11]రాసి సహస్రభానుఫణిరత్నము [12]నెల్లను పోవఁదన్నుచున్
వాసరభోగిఁ గాలఫణివైరి గడున్ వడి నొక్కి [13]నక్కుగాఁ
జేసినఁ గ్రమ్ము తద్రుధిరశీకరపూరవిజృంభణం బనం
గా సముదగ్రతం బొలిచెఁ గ్రమ్మి జపోపమసాంధ్యరాగముల్.

78
  1. చ.బొంగడొందు
  2. క.యేతెంచిన
  3. క.సందువ
  4. భాస్కరుఁడు
  5. క.జాతు
  6. క.సాంద్రశోణమతిభామరమై
  7. క.కుంభవ
  8. క.ర్రసరాశి
  9. సుంకెసాల
  10. క.సాంధ్య
  11. క.రాశి
  12. క.నెల్లటు
  13. క.చక్కుగా