Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తిక్కనసోమయాజి – విరాటపర్వము [1-121]

క.

తగఁ జొచ్చి తనకు నర్హం
బగునెడఁ గూర్చుండి రూప మవికృతవేషం
బుగ సమయ మెఱిఁగి కొలిచిన
జగతీవల్లభున కతఁడు సమ్మాన్యుఁ డగున్.

39

[1-130]

క.

నగళులలోపలి మాటలు
దగునే వెలి నుగ్గడింపఁ దన కేర్పడ నొం
డుగడన్ బుట్టినఁ బతి విన
నగు పని సెప్పెడిదిగాక యాతనితోడన్.

40

[1-132]

ఆ.

ఉత్తమాసనములు నుత్కృష్టవాహనం
బులును దమకుఁ గరుణ భూమిపాలుఁ
డీక తారె యెక్కు [1]టెంతటి మన్నన
గలుగు వారికైనఁ గార్యమగునె.

41

[1-137]

ఆ.

ఆవులింత తుమ్ము హాసంబు నిష్ఠీవ
నంబు గుప్తవర్తనంబు గాఁగఁ
జలుపవలయు నృపతి గొలువున్నయెడల బా
హిరములైనఁ గెలని కెగ్గు లగుట.

42

[1-139]

ఆ.

వసుమతీశు పాల వర్తించు నేనుఁగు
తోడనైన దోమతోడనైన
వైరమగు తెఱంగు వలవదు [2]తారెంత
పూజ్యులైన జనుల పొందు లెస్స.

43

నీతిసారము

క.

పతి చీర లట్టి చీరలు
పతి [3]తొడవుంబోలు తొడవు పతిగతి వేష
స్థితియును సేవకులకుఁ దగ
దతిధనయుతులైన ననుఁగులైనను సభలోన్.

44
  1. క.డెత్తరి
  2. క.వా
  3. క.తొడవుల