Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క్షత్రియుని శూద్రునిం [1]దప్ప సచివపదవి
వైశ్యు నిలుపంగఁదగదు భూవరుని కెపుడు.

33

చౌడన – నందచరిత

శా.

సారాచారవిచారు నుత్తమకులున్ సౌజన్యధన్యున్ గృపా
పారున్ శూరు వికారదూరు ననఘున్ గంభీరు ధీరు న్మహో
దారున్ భవ్యు సమస్తకార్యవిదు నాప్తప్రాప్తు సర్వేంగితా
కారజ్ఞున్ హిమ మంత్రిఁ జేసి పతి సౌఖ్యం బొందుచుండన్ దగున్.

34

[?]

క.

కులమున బలమునఁ జలమున
నలవునఁ గార్యమున సదృశులగు వారలతో
బలిమి యుడిగి సామముగాఁ
దలకొని చేయునది నీతితత్త్వజ్ఞునకున్.

35

చంద్రమౌళి - హరిశ్చంద్రకథ

చ.

అలసత బొంకు నాస్తికత యాయతచింతయు యుక్తికారితా
కలనము దీర్ఘసూత్రత వికాసము బొందమి దుర్వ్యయంబు పె
ల్లలుక నిరర్థకార్యరుచి యర్థమతచ్యుతి మంత్రహాని ప్రా
జ్ఞుల వెలి శాంతసౌమ్యకృతిశూన్యత నా నివి రాజదోషముల్.

36

శివదేవయ్య - పురుషార్థసారము

చ.

సకలజనానురంజనము సత్యము శౌచము మంత్రగోపనం
బకృపణవృత్తి దక్షత ధనార్జనశీలము భోగ మీఁగి నా
స్తికఖలసంగవర్జనము శిష్టవిధేయత దుష్టదూషణం
బకుటిలభావ మింద్రియగుణంబులు చూడఁగ భూమిభర్తకున్.

37

సేవకనీతి

బద్దెన నీతి [నీతిశాస్త్రముక్తావళి] [54]

క.

పతి కలిగి తానె పొలియును
[2]పతి నలిగించినను దనకె భంగము వచ్చున్
పతిమతమె కాని భటునకుఁ
బతితో నాగ్రహము చనదు బద్దెనరేంద్రా!

38
  1. క.దగు
  2. క.పతిన్నలిగించుదనకే, చ.నలిగించు[టను]