Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎఱ్ఱాప్రెగడ – కుమారనైషధము

చ.

కలిసి యొకళ్ళొకళ్ళు కసుగందని వేడ్కలఁ జూచువేళ ఱె
ప్పలు మఱువయ్యెనే నవియుఁ బాయుట తత్సుఖపారవశ్యులై
పలుకకయుండుటే యలిగి పైకొనకుండుటె యంతెగాని తొ
య్యలియు విభుండుఁ బాయుటయు నల్గుట నాఁగ నెఱుంగ రెన్నఁడున్.

184

తులసి బసవయ్య – సావిత్రికథ

చ.

విడిలిన మోవి కెంపులును [1]వ్రేకపుటూరుపుగాలి సొంపులున్
బడలిన మోవి యొప్పులును నాన దొఱంగిన మాటతప్పులున్
సడలిన కొప్పు బాగులును జంకెనచూపులు వింతలాగులున్
దడఁబడ నభ్యసించిరి ముదంబున నిద్దఱుఁ గామతంత్రముల్.

185

జక్కన – సాహసాంకము [4-226]

సీ.

తొంగలి ఱెప్పల తుదలు గైవ్రాలినఁ
              గొనరుఁజూపులయందు మిసిమిఁ జూపఁ
దారహారముల నర్తనఁ గళాసించినఁ
              గుచకుంభములమీఁదఁ గొంత నిక్కఁ
గుంతలంబుల త్రుళ్ళగింతలు [2]సడలినఁ
              గెమ్మోవి చుంబనక్రీడ కెలయ
మణికాంచివలయంబు మౌనంబు గైకొన్న
              నురునితంబము కేళి కుత్సహింపఁ


తే.

జెమట చిత్తడి మైపూఁత దెమలి చనిన
నెమ్మనంబునఁ దమకంబు నివ్వటిల్ల
నున్న జలజాక్షి యొప్పు నృపోత్తమునకు
మదనపునరుద్భవవికారమంత్ర మయ్యె.

186

ధూర్జటి కాళహస్తిమాహాత్మ్యము [1-43]

ఉ.

ఎక్కడఁ బట్టినం గళల యిక్కువ లెక్కడ నోరు సోఁకినన్
జక్కెర లప్ప లేమనిన సారసుధారస మెట్టులుండినన్
జక్కదనంబు పెన్నిధులు సంభ్రమ మొప్పఁగ నేమి సేసినన్
మక్కువ చెయ్వులై వెలయు మన్మథకేళి యొనర్చు నంతటన్.

187
  1. క.వేగపు
  2. క.నెడలిన