Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


              తాక్షి చూపునివాళులందు నలరి
షడ్రసాన్నములకై చనఁ డింతి యధరామృ
              తమ్మున నాప్యాయనమ్ము నొంది


తే.

యఖిలభోగము లబ్జాతముఖియె కాఁగ
బాలికామణిఁ గూడి యప్పార్ధివుండు
తెల్లవారుట రాత్రి యేతెంచుటయును
మఱచి నిధువనకేళి [1]సమ్మదము నొంది.

180

శ్రీనాథుఁడు – శృంగారనైషధము [7-171]

ఉ.

ఇంచుక యుల్లసించినను నేమని చెప్పఁగ? లజ్జ వచ్చి వ
ర్జించును సాధ్వసం బడరి శిక్ష యొనర్చును మౌగ్ధ్య మేఁచి వా
రించుఁ బ్రగల్భభావము ధరించి యటేని వధూమనోగతిన్
బంచశిలీముఖుండు పసిపాపఁడువో న(వసం)గమంబునన్.

181

[7-178]

చ.

కుతుకమునం గురంగమదకుంకుమచర్చ వహించి నీలలో
హితరుచులై స్వయంభులయి యీహితసౌఖ్యవిధాయులైన య
య్యతివ పయోధరంబులకు నర్ధనిశాసమయంబునన్ సమం
చితనఖకింశుకార్చనము సేసె మహీపతి భక్తి యేర్పడన్.

182

[7-177]

సీ.

పతిపాణిపల్లవచ్యుతనీవిబంధన
              వ్యగ్రబాలాహస్తవనరుహంబు
ధవకృతాధరబింబదశనక్షతివ్యధా
              [2]భుగ్నలీలావతీభ్రూలతంబు
ధరణినాయకభుజాపరిరంభమండలీ
              గాఢపీడితవధూఘనకుచంబు
వరనఖాంకురమృదువ్యాపారపులకిత
              నీరజాక్షినితంబోరుయుగళి


ఆ.

యస్తి వామ్య[భా]ర మస్తి కౌతూహలం
బస్తి ఘర్మసలిల మస్తి కంప
మస్తి భీతి యస్తి హర్ష మస్తివ్యధం
బస్తి వాంఛమయ్యె నపుడు రతము.

183
  1. క.సమ్మతము
  2. క.భృంగ