Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

[1]విష్ణువె యడుగనేటికి విశ్వమూర్తి
[2]యగుట నచ్యుతుండఁట నిత్యుఁ డనఁగ నేల
యని మునీంద్రులు గొనియాడ నతిశయిల్లు
నమ్మహాత్ముండు సర్వలోకాధికుండు.

31

కంచిరాజు సూరయ - కన్నప్పచరిత

ఉ.

కారణమేమి? రక్కసు నఖంబుల వ్రచ్చితి నాఁడు నీకుఁ బెం
పారఁ గుఠారమబ్బదొ? పురారివిరించులు చేరి యేటికిన్
[3]గోరను బోవు సేఁతలకు గొడ్డలి యన్నఁ దొఱంగితో వినం
గోరెదనన్న యిందిరకుఁ గోర్కులు నిచ్చు ముకుందుఁ గొల్చెదన్.

32

భీమకవి - దశావతారము

సీ.

శ్రుతిసుధాక్ష్మాభక్తసురజననీవధూ
              మల్లశంకరధర్మ మహితబుద్ధి
[4]కగకూర్మ [5]కిటినరమృగ [6]కుబ్జరామ రా
              మానంతబుద్ధకల్క్యాహ్వయముల
నముచిమందరకుదానవబలార్జునపంక్తి
              ముఖముష్టి కస్త్రీవిముక్తఖలులఁ
దత్పుచ్ఛకర్పరదంష్ట్రాగ్రనఖపద
              పరశుబాణహలాంగఖురపుటములఁ


ఆ.

జెరివి తాల్చి యెత్తి చీరి బంధించి ని
ర్జించి యేసి యేర్చి చెఱిచి మట్టఁ
గణఁగుచున్న శౌరి కరుణావిధేయుఁడై
మనలఁ గోర్కు లిచ్చి మనుచుఁగాఁత.

33

ఈశ్వరస్తుతి

[7]సంకుసాల సింగయ – కవికర్ణరసాయనము 3.పీ

మ.

ముకుటాగ్రస్థితచంద్రచంద్రిక సదా ముంపన్ బ్రభాతం బెఱుం
గక శశ్వత్వరిరంభణానిరతసౌఖ్యస్నిగ్ధుఁడై జాయఁ బా
యక లీలాపరుఁడైన శంకరుఁడు నిత్యప్రీతి సంధించుతన్
సకలాహ్లాదముగా మదీయకృతికిన్ శబ్దార్థదాంపత్యమున్.

34
  1. ట. విష్ణుఁడట యడ్గనేటికి
  2. ట. యనఁగ ?
  3. క. గోరున
  4. ట. గగకూర్య
  5. క. కిట
  6. క. కుంజ
  7. సుంకసాల