Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హరిస్తుతి

[1]సంకుసాల సింగయ – కవికర్ణరసాయనము (1 పీ)

శా.

శ్రీరామావసుధాపయోధరములం [2]జేదోయి రెంటన్ సమ
ప్రారంభంబునఁ జిత్రభంగి మకరీపత్రాంకముల్ వ్రాసి ని
ర్వైరప్రేమల నిద్దఱందు సమసారస్యంబునం దేలు నా
శ్రీరంగేశుఁడు మమ్ము నిర్మలసుఖశ్రీయుక్తులం జేయుతన్.

28

ప్రౌఢకవి మల్లయ్య – రుక్మాంగదచరిత్ర [1-2]

చ.

కలశపయోధికన్య మృదుగండమరీచులనీడఁ జూచుచున్
దిలకముఁ గమ్మకస్తురిఁ బ్రదీప్తముగాఁ గొనగోర దిద్దు ను
త్పలదళమేచకద్యుతికదంబశరీరుఁడు [3]మాధవుండు ని
చ్చలు కరుణాకటాక్షమున సన్మతితో మముఁ బ్రోచుఁగావుతన్.

29

జయతరాజు ముమ్మయ - విష్ణుకథానిధానము

శా.

శ్రీరామాస్పదమైన పేరురముపై శ్రీవత్సచిహ్నంబుఁ దా
నారూఢంబుగఁ దాల్చి [4]శ్రీకిఁ దగు చిహ్నల్ గల్గువాఁడౌట సొం
పారన్ దెల్లమి సేయు దేవుఁడు కృపావ్యాసక్తుఁడై మామక
ప్రారంభంబు నిరంతరాయశుభసాఫల్యంబుగాఁ జేయుతన్.

30

[?]

సీ.

శృంగారవిభుఁడని చెప్పంగనేటికి
              భావజుఁ గొడుకుఁగాఁ బడసెననినఁ
గారుణ్యనిధియని గణుతింపనేటికి
              సృష్టిరక్షణ నిత్య[5]శీల మనినఁ
బరమపావనుఁడని ప్రణుతింపనేటికి
              గంగఁ బాదంబునఁ గాంచెననిన
ఘనవైభవుండని కొనియాడ నేటికిఁ
              గలిమి ముద్దియ కులకాంత యనిన

  1. సుంకసాల
  2. క. చేదోలు
  3. క. భూధవుండు
  4. క. శ్రీ క
  5. ట. శీలుఁ డనిన