Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[1]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [3-217]

తే.

ముగ్ధ యగుఁగాక యేమింత ముగ్ధ గలదె?
బాల జఘునాంశుకం బింక నేల పెనఁగ?
రాజవరున కురోజదుర్గములు రెండుఁ
జేపడియెనట్టె [2]యిఁకఁ గ్రింది సీమ యెంత.

175

[3-212]

సీ.

తల వంచుటయె కాని తప్పక కను ప్రేమ
              ఘనమని లోచూపు గతము వెట్ట
మౌనముద్రయె కాని మాటాడు వేడుక
              గడుసని ముఖకాంతి ముడియ లేయ
నడ్డగించుటయె కాని యాలింగనప్రీతిఁ
              బలువని కంపంబు బాస సేయఁ
బై వెట్టమియె కాని పైకొను తమి కల్మి
              సత్తని పులకలు సాక్షి పలుకఁ


తే.

గరుణముగ వేఁడఁ జొరమియె కాని మనసు
కరఁగినది యని చెమట పైకంటఁ జాట
హృదయనాథుని మది దక్క నేలుకొనియె
బాలికామణి యపు[3]డు దాఁ బ్రథమరతిని.

176

[3-223]

సీ.

నెమ్మోవి దాఁచెడి నెపమునఁ జెక్కులు
              చుంబింప [4]నెడమిచ్చు సుదతి నేర్పుఁ
గినిసి చెక్కులు దాఁచికొనియెడి నెపమున
              మోము మోమునఁ గూర్చు ముదిత వెఱపు
సడలెడు తన నీవి [5]సవరించు నెపమునఁ
              గౌఁగిటి [6]కొదవించు కాంత తలఁపుఁ
గరములఁ జనుదోయి గప్పు నెపంబున
              [7]నీవిక సందిచ్చు నెలఁత మతముఁ


తే.

[8]దొడిఁబడక గానఁబడనీక యొడలు నులియు
నెపముమైఁ గౌఁగిటి కెదుర్చు నీరజాక్షి
యుపమయును భూమివల్లభు నుల్లమునకుఁ
గ్రొత్తచవి గొల్పె మఱి వేఱె కొన్నినాళ్ళు.

177
  1. సుంకుసాల
  2. క.మరి
  3. క.డీడ
  4. క.నెడరిచ్చు
  5. క.సడలించు
  6. క.కొరపిచ్చు
  7. క.నెరికికి
  8. క.నెడ