సంభోగమునకు
పెద్దిరాజు – అలంకారము [3-121]
తే. |
తనరు నెనుబదినాల్గు బంధములయందు
నమరుఁ బ్రచ్ఛన్నమును బ్రకటము ననంగ
సురతములు రెండు వాని విస్ఫురణ సొంపు
వలయు వర్ణింప నిఖిలకావ్యములయందు.
| 172
|
సీ. |
పొలయల్కఁ దలఁపులఁ బులకించుఁ బులకించి
బింకంపుఁ గౌఁగిళ్ళ బిగి భజించు
మరుచిహ్న లున్నెడఁ బరికించుఁ బరికించి
చొక్కుచుఁ జెమరిన యిక్క లరయు
దొలిమ్రొక్కు [1]చెవిచెవిఁ జివికించుఁ జివికించి
మురిపెంపు సిగ్గుల మూరిఁబోవుఁ
బంజరమునఁ జిల్కఁ బలికించుఁ బలికించి
నొడువు లాలములైన నోరు నొక్కు
|
|
తే. |
సొబగుటడుగుల లత్తుక చూచుఁ జూచి
[2]యరిగి శయనించు [3]మారయ నప్పళించు
వెలఁది యొక్కర్తు చాళుక్యవిభుని[చేత]
భావజాతుని గెలిచిన భావ మొప్ప.
| 173
|
కూచిరాజు ఎఱ్ఱయ – కొక్కోకము
సీ. |
వలిపె పయ్యదలోన నిలువక వలిగుబ్బ
చనుదోయి మెఱుగులు చౌకళింపఁ
బగడంపు వాతెర పైకి నించుక జాఱు
మొగమునఁ జిఱునవ్వు మొలకలెత్తఁ
గొలఁకుల నునుకెంపు తిలకించు క్రొవ్వాఁడి
దిట్టచూపులు తలచుట్టి తిరుగ
నునుగొప్పులోపల నునిచి పూవులతావి
మీఁదికి దాటి తుమ్మెదలు పిలువఁ
|
|
తే. |
దొడవులకు నెల్లఁ దొడవైన యొడలితోడ
వలపులకు నెల్లఁ దనమేని వలపు దెలుపఁ
బరఁగు కామిని తన వామపార్శ్వమునను
గదియగా నిల్చి వేడ్కలు గదురుకొనఁగ.
| 174
|
- ↑ క.చవిచవి
- ↑ క.యలగి
- ↑ క.మాయన