ప్రౌఢకవి మల్లన రుక్మాంగదచరిత్ర [1-132]
సీ. |
పాయసాన్నము లపూపములు పెసరపప్పు
లాజ్యప్రవాహంబు లరటిపండ్లు
ఖండశర్కరలు మీఁగడ లిక్షుఖండముల్
తీయఁగూరలు చారుతిమ్మనములు
[1]పైళ్ళుపుట్టలు కట్లు చల్లరసంబులు
పచ్చళ్ళు శిఖరలు పనసతొనలు
మామిడితాండ్ర యామలకముల్ పానక
ములు రసావళ్ళాల ముద్దపెరుఁగు
|
|
తే. |
సొంఠి మజ్జిగలును భూమిసురసహస్ర
ములకు గంధాక్షతలపూజ మున్నుగాఁగ
నారగింపుల నిడి విడియంబు లొసఁగి
తారుఁ బారణ సేసిరి త[త్]క్షణంబ.
| 164
|
తాంబూలమునకు
క. |
తలపోయఁగ రుచు లాఱును
గలుగును వాతంబుఁ గ్రిమియుఁ గఫముం జెడు నాఁ
కలి పుట్టు దగయుఁ జెడుఁ ద
మ్ములము పదార్థంబు రాగమూలము ధరణిన్.
| 165
|
చ. |
వదనవికాససౌరభవివర్ధనకారి లసన్మదాపహం
బుదరవిశేషసౌఖ్యకర[2]ముద్గతదోషబలప్రహారి తా
మదజనకంబు తమ్ములము మానవతీపతిభోగవేళలన్
మదనపునర్భవీకరణమంత్రము తుల్యమె దీని కెద్దియున్.
| 166
|
సీ. |
లఘుకారి క్రిమిదోషవిఘటనసంధాయి
దీపననిర్దోషదీప్తికరము
పాషాణచూర్ణంబు పైత్య[3]వాతఘ్నంబు
శంఖంబు కఫపైత్యశక్తిహరము
చిప్పలసున్నంబు శ్లేష్మంబు [4]నణగింపుఁ
గుల్లసున్నము వాతగుణముఁ జెఱుచుఁ
|
|
- ↑ గ.అప్పడములు పెనునామవడలు మంచి
- ↑ గ.ముగ్ధత
- ↑ క.దాత్యఘ్నంబు
- ↑ గ.హరియించు