|
చెలఁగి పూఁదేనియలఁ దేఁటి సిద్ధులకును
వెలఁది యెదుటను జూఱ గావించె నపుడు.
| 104
|
సీ. |
విరదమ్మిసురటుల విసరకే యెలనాగ!
యుష్ణాంశుచెలు లవి యుడుకు చల్లు
వెలఁది ముక్తాహారములు వైవకే సఖి!
యౌర్వాగ్నితోఁబుట్టు లవి యలంచు
+ + + + + + + + + + + + + +
+ + + + + + + ++ + + + + +
+ + + + + + + + + + + + + +
+ + + + + + + ++ + + + + +
|
|
తే. |
చెలఁగి పన్నీరు చల్లకే కలువకంటి!
రాహుదంష్ట్రలు సోఁకిన రాజుమేని
కనటు చేఁబ్రోది యగు నది గాదు మిగులఁ
గాన నవియెల్ల నబల నీగతికిఁ దెచ్చె.
| 105
|
[1]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [3-122]
సీ. |
స్వర్ణకుంభములకు వర్ణలేపము గాఁగఁ
జన్నుల కుంకుమం బలఁది యలఁది
వెడవిల్తు [2]నలుగులు [3]దొడయుటగాఁ గన్ను
వెడపక పన్నీటఁ దుడిచి తుడిచి
లేఁతతుమ్మెదలకు మేతగా విరిదమ్మి
పుప్పొడిఁ గురులపైఁ బోసి పోసి
యనుఁగుఁజుట్టములతో నాలింగనములుగాఁ
బదకరంబులఁ జిగు ళ్ళదిమి యదిమి
|
|
తే. |
కప్పురపుధూళి మేనిపై గుప్పి గుప్పి
విపులకదళీదళంబుల వీచి వీచి
విరహపరితాపవతి యైనవెలఁది కపుడు
చెలులు శిశిరోపచారముల్ సేయఁ జేయ.
| 106
|
మ. |
పటికి న్నార్చిన లీలఁ జందనము పై పైఁ బూయ నంగారక
చ్ఛటలం గాఁచు తెఱంగునం జిగురుసెజ్జన్ బొర్లఁగా నప్పట
|
|
- ↑ సుంకసాల
- ↑ క.నడుగులు
- ↑ క.దడయుట