Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దహనమహాకీర్తిమహిమ యనఁగఁ
గలువలు కనుఁగవ నల నొత్తె నొక్కర్తు
              ప్రాణవాయువు లోని కణఁచె ననఁగ
బొడ్డుమల్లియ లొక్కపొలఁతి రాశిగఁ బోసె
              నంగజభూతోపహార మనఁగ


తే.

నబల కీరీతి శిశిరకృత్యము లొనర్ప
నంతకంతకు సంతాప మావహిల్లఁ
జెలులఁ గనుఁగొని తమలోన నలబలంబు
లుడిగి నివ్వెఱఁ గంద నం దోర్తు చూచి.

102

శ్రీనాథుఁడు – శృంగారనైషధము [2-141]

సీ.

పద్మిని! కన్నీరు పన్నీటఁ దుడువుము
              రంభాదళంబు సారంగి! వీవు
కల్పవల్లి! యొనర్చు కర్పూరతిలకంబు
              చక్రవాకి! యలందు చందనంబు
వలిపెంపుఁ [1]జెంగావి వలువఁ గట్టు చకోరి!
              బిసకాండహారంబు వెట్టు హరిణి!
కలకంఠి [చేర్చు] చెంగలువ యెత్తు దలాడ
              కలికి! పైఁ [2]జిలికించుఁ గమ్మఁదేనె


తే.

బాల శైవాలమంజరీజాలకంబు
లిందుమతి! యొత్తు మఱి చేతులందుఁ గదియ
నప్పళింపు మదాలస! యడుగులందుఁ
జల్లగాఁ బుండరీకకింజల్కధూళి.

103

ఎఱ్ఱాప్రెగడ – కుమారనైషధము

సీ.

తొలి[3]తొలి కోసిన తోరంపుఁ గ్రొవ్విరు
              లించువిల్తునికి మీఁ దెత్తి మ్రొక్కి
పద్మపరాగంబు భసితంబు మంత్రించి
              పువ్వారుఁబోణికి బొట్టు వెట్టి
సంపంగిఱేకున సర్వంబు లిఖియించి
              రాజాస్యకరమున రక్ష గట్టి
నెఱిఁ బచ్చనివి యెఱ్ఱనివియైన వొనగూర్చి
              [4]బడిసి పుష్పంబుల బడిమి పోసి


తే.

మదచకోరంపుమఱక నేమఱక ద్రిప్పి
పడఁతికిని దమ్మికప్పెర వెడలఁజేసి

  1. క.చలిగాలి
  2. క.జికిలించు
  3. చ.దలి
  4. చ.బడసి