Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కావ్యలక్షణలక్ష్య[1]గణితాదిసత్కళా
              ప్రజ్ఞావిశేషవైభవము గలిగి
రాజవిద్వత్సభారసికబాంధవమాన
              నీయధర్మాచారనియతి మెఱసి


తే.

మల్లప్రెగ్గడవీరనామాత్యపుత్త్రి
రామ నభిరామ గుణధామ రామనామ
కామినీమణిఁ బెండ్లియై ఘనగృహస్థ
మహిమఁ జెలువొందు జగ్గన మంత్రివరుఁడు.

21

షష్ఠ్యంతములు

క.

శ్రీరమణీరమణునకును
నారదశుకజనకసనకనలినాసనహృ
న్నీరజనిరతోపాసన
కారణపదకమలయుగళకలితాకృతికిన్.

22


క.

నీలాచలనిలయునకును
నీలాచలదమలనయననీరజరవికిన్
నీలాంభోరుహశతముఖ
నీలాభున కఖిలలోకనేతకు హరికిన్.

23


క.

రాజీవాయతమూర్తికి
రాజీవదళాక్షునకును రామునకును వై
రాజ[2]స్ఫూర్జితకీర్తిత
రాజకళాధరున కఖిలరక్షామణికిన్.

24


క.

అంభోనిధికన్యాకుచ
కుంభపరీరంభదంభగుంభనబాహా
స్తంభచతుష్టయసంభ్రమ
సంభారారంభునకును జలజాక్షునకున్.

25


క.

శరణాగతవత్సలునకు
తరుణారుణకోటితుల్యధామునకు లస
ద్వరుణాలయగతగురుసుత
కరుణాశరణునకు శ్రీజగన్నాథునకున్.

26


వ.

ఏను విన్నవింపఁబూనిన ప్రబంధరత్నాకరంబునకు వర్ణనా[3]గౌరవం బెట్టిదనిన నారాయణస్తుతియును శంకరప్రభావంబును
ద్రిపురవిజయాభిరామంబును నర్ధ[4]గౌరీశ్వరంబును హరిహరాత్మకంబును బ్రహ్మస్తుతియును ద్రిమూర్తిస్తుతియును
లక్ష్మీగౌరీసరస్వతీప్రభావంబును నష్టదిక్పాలకాదిదైవతాప్రార్థనంబును వినాయకషణ్ముఖ[5]భైరవమైలారగుణోత్కర్షయును

  1. క. గణికాది
  2. క. స్ఫూర్తిత
  3. ట. క్రమం
  4. ట. నారీ
  5. ట. 'భైరవ' లేదు.