Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముక్కు తిమ్మయ్య – పారిజాతము [3-14]

ఉ.⁠

కాళియభేదిఁ జూచు తమకంబున మజ్జనమాడి యాడి నీ
లాలక యోర్తు గంధసలిలార్ద్రకచంబులు చన్నుదోయిపై
[1]రాలిచి సందిటం బొదివి రాజపథంబున కేఁగుదెంచె గో
పాలకమూర్తిఁ గాన [2]శిఖిబర్హము కానుక దెచ్చెనో యనన్.

⁠ 67

[3]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [3-157]

ఉ.⁠

అంబుజనేత్ర యోర్తు వసుధాధిపు గన్గొనుచో రసాతిరే
కంబునఁజేత మున్ను తమకంబునఁ దెచ్చిన దర్పణంబులో
బింబితమైన రాజు ప్రతిబింబము చెక్కున నొక్కి గ్రక్కునన్
జుంబన మాచరించి చెలిఁ జూచి ముఖాబ్జము వంచెఁ గ్రక్కునన్.

⁠ 68

అన్యోన్యవీక్షణలు

తిక్కన సోమయాజి – విజయసేనము

సీ.⁠

మదనవశీ[4]కరమంత్రదేవత దృష్టి
              గోచరమూర్తిఁ గైకొనియెనొక్కొ
సితకరబింబనస్సృతసుధాధార ని
              తంబినీరూపంబుఁ దాల్చెనొక్కొ
విధికామిని[5]సృష్టి విజ్ఞానపరసీమ
              భాసురతనులీలఁ బడసెనొక్కొ
శృంగారనవరసశ్రీవిలాసోన్నతి
              సుందరాకారంబు నొందెనెక్కొ

⁠


ఆ.⁠

కాక యొకవధూటి కడుపునఁ బుట్టిన
భామ కేల యిట్టి రామణీయ
కంబు గలుగు ననుచుఁ గన్నియపై మహీ
పాలసుతుఁడు దృష్టి పరవె నర్థి.

⁠ 69


క.⁠

కిసలయకదళీబిసబిం
బసుధాంశుప్రాయవస్తుబహువిధరూపో
ల్లసము ముద ముడుప నజుఁ డొక
యసమాకృతిఁ [6]దాల్చె నొ[క్కొ] యంగన గాఁగన్.

⁠ 70
  1. ↑ గ.వ్రాలిన
  2. ↑ క.శశి
  3. ↑ సుంకసాల
  4. ↑ చ.కార
  5. ↑ క.శ్రేష్ఠ
  6. ↑ చ.దార్చె ననఁగ నంగన యొప్పెన్