Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిల్లలమఱ్ఱి వీరయ్య- శాకుంతలము

మ.

నవలావణ్యపయోధిఁజిత్త మను మంథానాద్రికిం జంద్రికా
పవనాశిం దరిత్రాఁడుగాఁ బెనఁచి [1]యబ్జాతాశుగుం డిచ్చినన్
రవళిన్ కోకిలకీరముల్ [2]దరువ నా రత్నాకరంబందు ను
ద్భవముం బొందిన లక్ష్మి గావలయు నా పద్మాక్షి వీక్షింపఁగన్.

62

నన్నెచోడఁడు – కుమారసంభవము [8-5]

మ.

హరినీలోపమమధ్యకేశి శశిబింబాస్యోష్ఠ రాజీవకే
సరనేత్రామలగంధి విద్రుమలతాసద్వర్ణతన్వంగి సిం
ధురకుంభాలసయాన పూర్ణ[3]కుచ సంస్తుత్యా[4]రుణాబ్జాంఘ్రికం
ధర [5]శైలాత్మజ చెప్ప నొప్పదె సుధా[6]ధామార్ధచూడామణీ.

63

[8-7]

క.

నెఱి గడచి నాఁడు నాఁటికి
గుఱి గడవగఁ బెరిగి జఘనకుచకచభరముల్
చిఱుతొడలు నడుము నఱ్ఱును
[7]విఱిగెడినో యనుచు గిరిజ వెఱచుచు నడచెన్.

64

వీథినాటకము [91]

క.

వ్రాలని నీ చన్నులతో
వ్రాలెడు జక్కవలు సరియె వలలం బెట్టం
జాలెడు నీ కన్నులకును
బాలకి సదృశములె వలలఁ బడు మత్స్యంబుల్‌.

65

చూపఱకు

కంచిరాజు సూరయ - కన్నప్పచరిత

మ.

తమ సౌభాగ్యము లంగసంభవుని భద్రశ్రీల సేవింపఁగాఁ
దమ దృగ్జాలము లాలతాంతశరకుంతశ్రేణిఁ బాలింపఁగాఁ
దమ వృత్తస్తనభారముల్ మరుని చిత్తస్ఫూర్తి సూచింపఁగాఁ
దమకం బారఁగఁ జేరి చూచిరి పుళింద[8]గ్రామణిన్ బ్రేముడిన్.

66
  1. క.యబ్జాతాసనుం డిచ్చినన్
  2. క.దరహసే
  3. క.రుచి
  4. క.రుణజ్వాంఘ్రి
  5. క.శైవాత్మ
  6. ధర్మార్థ
  7. గ.విఱుగక తప్పదని
  8. క.గ్రామిన్