పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రీస్తుకు పూర్వము ఆరవ శతాబ్ది : మతము

87


నేడు బౌద్ధమతము ప్రపంచమం దత్యధికసంఖ్యాకులచే నవలంబించబడియున్నది. అధిక సంఖ్యాకులుగల యితర మతములు క్రైస్తవ మతము, మహమ్మదీయమతము, హిందూమతము, ఇవిగాక హీబ్రూల, సిక్కుల, పారసీకుల, ఇతరుల మతములుకూడ ఉన్నవి. మతములును వాటిని స్థాపించిన పురుషులును ప్రపంచచరిత్రలో అధికముగా పాల్గొన్నారు. చరిత్రను తిరుగవేయునప్పుడు వారిని మనము ఏమరిచి యుండరాదు. వారినిగురించి వ్రాయుటకు నేను సంకోచించుచున్నాను. గొప్ప మతములను స్థాపించినవారు నిస్సందేహముగా గొప్పవారును, ఉదారులును, కాని వారిశిష్యులును, వారితరువాత వచ్చినవారును తరుచుగా అంతగొప్పవారునుకారు. మంచివారునుకారు, మనలను ఉద్దరించవలసినట్టియు, మనలను ఉదారులుగాచేయవసినట్టియు, మతము పశుప్రాయులుగా జనులు ప్రవర్తించునట్లు చేసినట్లు చరిత్రలో మనము చూచుచున్నాము. జ్ఞానమిచ్చుటకు బదులు జనులను అజ్ఞానాంధకారముననుంచుటకు ప్రయత్నించెను. వారిమన స్సులను విశాలపరచుటకు బదులువారిని సంకుచితబుద్దులుగను, పొరుగుపచ్చ కిట్టనివారినిగాను చేసెను. మతము పేరఅనేక మహత్కార్యములు చేయబడినవి. మతము పేరటనే వేలకొద్ది, లక్షలకొద్ది జనులు హత్యచేయబడిరి. అన్ని విధములగు దుష్కృత్యములును చేయబడినవి.

అయితే మతముతో ఒకవ్యక్తి కుండవలసిన సంబంధ మేమి? కొందరికి మతమన్న పరలోకమని యర్థము. స్వర్గమో, దివ్యలోకమో. ఏదోయొక పేరు. స్వర్గమునకు పోవలెననివారు మత ప్రవిష్టులై కొన్ని కార్యములు చేయుదురు, జీలేబీ దొరుకునని తంటాలుపడు చిన్నపిల్లకథ జ్ఞాపకమునకు వచ్చుచున్నది. ఆస్తమానమును జిలేబీ మీదబుద్ధి పెట్టుకొను చిన్నపిల్ల సరియైన శిక్షణ పొందినదని చెప్పగలవా? జిలేబీలవంటి భక్ష్యములు పొందుటకొరకే పనులుచేయు బాలబాలికల ప్రవర్తన ఆమోదింప దగినదా ! వయస్సువచ్చిన పెద్దమనుష్యులీవిథముగా ప్రవర్తించిన మన