పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధన మెచ్చటికి పోవును?

79


నిజముగా ఒకపెద్ద పనిముట్టు. ఆహారపదార్ధములను, కార్మాగారములలో తయారైన పదార్థములను దూరదేశములకు త్వరలో తీసికొని పోవుటకు రైళ్ళును, ఓడలును ఉపకరించినవి. ప్రపంచమునం దంతటను పరిస్థితులలో ఎట్టిమార్పు వచ్చినదో నీ వూహించుకోగలవు.

ఆహారపదార్థములను, ఇతరవస్తువులను త్వరలో ఉత్పత్తిచేయు నూతనపద్ధతులు చరిత్రలో అప్పటప్పట కనిపెట్టబడినవి. ఉత్పత్తి చేయుట కింతకన్న మంచిపద్ధతులను ప్రవేశ పెట్టినచో ఎక్కువ సరకు ఉత్పత్తియగుననియు, ప్రపంచము భాగ్యవంత మగుననియు ప్రతి యొక్కనికిని ఎక్కువగా పదార్థములు లభ్యమగుననియు, నీ వనుకొనవచ్చును. నీ ఊహ కొంతవరకు సరి. కొంతవరకు తప్పు. ఉత్పత్తికి శ్రేష్ఠపద్దతులుపయోగించుటవల్ల ప్రపంచము భాగ్యవంతమైనమాటనిజమే కాని ప్రపంచములో ఏ భాగ మట్లు భాగ్యవంతమైనది ? మన దేశములో ఇంకను కటిక దారిద్ర్యము, దైన్యము నిలిచియున్నవనుట నిర్వివాదము . కాని ఇంగ్లాండువంటి భాగ్యవంతమగు దేశములోకూడ ఇట్లే ఉన్నది. ఎందువల్ల? ధన మెచ్చటికి పోవును ? నానాటికిని ధనము అధికముగా వచ్చుచున్నను బీదవారు బీదరికములోనే కొట్టుకొనుచుండుట ఆశ్చర్యమే. కొన్ని దేశములలో బీదవారిస్థితి కొంతవరకు నయము. కాని వచ్చిన ధనముతో పోల్చిచూచిన వారి బాగు బహుస్వల్పమనియే చెప్పవలెను. కాని ఈ ధన మెవరికి పోవుచున్నదో మనము సులభముగా కనుగొనగలము , పెత్తనదార్లును, నలుగురిని కలియగట్టుకు వచ్చువారును ఉన్నారుగదా ! వారు లాభములలో అధికభాగము తాము సంగ్రహించుటచే ఈ ధనము వారి వశమగుచున్నది. ఇంతకన్న వింతవిషయ మేమనగా - సంఘములో కొన్ని తెగలు బయలు దేరినవి. వారెట్టిపనిని చేయరు సరికదా ఇతరులు చేసినదానిలో అధికభాగము తాము తీసికొందురు. నమ్ముదువో లేదో - ఈ తెగ మనుష్యులు గౌరవింపబడుచున్నారు. కొందరు వివేకహీనులు తమ బ్రతుకునకై రాము స్వయముగా పనిచేసికొనుట గౌరవలోపమని