పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

78

ప్రపంచ చరిత్ర


అసామర్థ్యమువల్ల నైతేనేమి, చేయుట మానుకొనిరి, వారు ఏమియు చేయకున్నను వ్యవసాయదారులు పండించిన పంటలో అధికభాగము పుచ్చుకొను విషయములో మాత్రము శ్రద్ధవహించుచుండిరి. తామేమియు చేయనక్కరలేదనియు, ఇతరులు చేసిన కష్టమును అనుభవించుటకు తమకు హక్కున్నదనియు వారూహించ మొదలిడిరి.

చూచితివా. వ్యవసాయము వచ్చుటవల్ల జీవితవైఖరి ఎట్లు మారినదో ? వ్యవసాయము ఆహారము సంపాదించుటకు మంచి పద్దతిని ప్రవేశపెట్టుటవల్లను, సులభముగా ఆహారముదొరుకునట్లు చేయుటవల్లను అది సంఘము యొక్క పుట్టకీట్లను మార్చివేసినది. అది ప్రజలకు విరామమిచ్చినది. వేర్వేరు తెగల మనుష్యులు ఏర్పడిరి. ప్రతియొక్కడును ఆహారమును సంపాదించుటకు పాటుపడుటలేదు. కొందరు వేరొకపని చేసికొనవచ్చును. అనేకరకముల కళలు తలయెత్తినవి. క్రొత్తవృత్తులు : ఏర్పాటైనవి. కాని అధికారము ప్రజలను కలియగట్టుకువచ్చు వారిచేతులలోనే ముఖ్యముగా నిలిచిపోయెను.

ఆహారమును, ఇతర జీవితావసరములను తయారుచేయుటకు నూతన పద్దతులు వచ్చినప్పుడు ఎట్టి గొప్ప మార్పులు తటస్థించినవో పిదప కాలపు చరిత్రలో నీవు తెలిసికొందుపు, ఆహారమును వలేనే ఎన్నియో ఇతరవస్తువులను సైతము మానవులు వాంఛించుచుండిరి. కాన ఉత్పత్తిపద్ధతులలో గొప్పమార్పు వచ్చినప్పుడు సంఘమందుకూడ గొప్పమార్పులు కలుగుచుండెను. ఇందుకై నీకొక పెద్ద దృష్టాంతము చూపెదను. కర్మాగారములు పనిచేయుటకును, రైళ్ళను, ఓడలను నడుపుటకును నీటి ఆవిరిని వినియోగించినప్పుడు ఉత్పత్తి పంపకము చేయు పద్ధతులలో గొప్పమార్పు వచ్చినది. శిల్పులును, పనివాండ్రును సామాన్యోపకరణముతో, చేతులతో, వస్తువులు చేయుటకు కొంతకాలము పట్టును. ఆవిరి నుపయోగించు కర్మాగారము లింతకన్న త్వరగా ఆ వస్తువులను తయారుచేయగలవు. ఒక గొప్ప యంత్రము