పుట:పెళ్ళి ట్రయినింగు-02.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1 వ రంగం

[శానయ్యబన. చిన్న బల్లా, రెండుమూడు కుర్చీలూ ఉన్న గది. తెరఎత్తిన తరవాత కుడిఎదరనించి శానయ్య వచ్చి ఎవరికోసమో కనిపెట్టుగున్నట్టు కనిపించి పచారుచేస్తూ ఉంటాడు. ఎడమ ఎదరకేసి చూస్తాడు. అక్కణ్ణించి సరయ్య వస్తాడు.]

శా:- (ఎడమ ఎదరనించి సరయ్య రాబోతూంటే) సరయ్యేనా? రా! (అని కుర్చీ చూపిస్తాడు)

స:- (వచ్చి కూర్చుంటాడు)

శా:- ఇంత ఆలస్యం అయిందేం? మా మాలోకాన్ని పంపించి చాలా సేపైందే!

స:- ఎమో ! ఇంతకి ముందే వచ్చి చెప్పాడు మరి ?

మా:- (ఎడమఎదర్నించే వచ్చి) చాలాసేపైందండీ, చెప్పి, నే నాఎర్రస్తంభాల...

శా :-- సరేరా నవ్వు ఉండు.

మా:- ఉంటానండి. (అని అక్కడే నుంచుంటాడు)

శా:- ఉండడం అంటే వీధులో.

మా:- అక్కడ నేను కూచోవాఁడి !

శా:-- ఏడిశావ్ పోదూ. వెళ్ళి ఎవరూ రాకుండా చూ