పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

పాన్పు శుభ్రంబుగాఁ జేసి వచ్చి, స్నాన
మాడు నందాక తనయొద్ద నతని నుండు
మనుచుఁ బ్రార్థించి, తరువాత ననుపమాన
మైన తెఱఁగున ముస్తాబు లై చెలంగు.


తే.

అంత ముస్తాబుగా తయా రౌచు ఱైక
మాత్రమే తొడుగుమనుచు మాటిమాటి
కల్లవానిని బ్రతిమాలి యతనిచేత
కోరి తొడిగించుకొనుచుండు కొమ్మ సతము.


తే.

ఆతఁ డేనగ లిచ్చిన యానగలనె
యాతఁ డేచీర నిచ్చిన యద్ది మాత్ర
మాతఁ డేఱైక నొసఁగిన నదియ కాని
తాను మాత్రము స్వాతంత్ర్య మూన దెపుడు.


తే.

అది యతం డొక్కరీతి తయారు లగుచు
నిలువుటద్దంబు దరికేగి నిలిచి ‘మనల
లోన బాగుండునది, నీవ నేన?’ యనుచు
తగవు లొందుచు, తుద కెల్ల తగవు తీఱ.


తే.

కేలుకేలను గొని వేగఁ బూలపాన్పు
దరికిఁ జని పైకి యెక్కి యాతలిరుఁబోణి
‘నీవ నేనా’ యటంచు ననేకవిధుల
బలుకఁదొడఁగును సుధకారి మొలక లెత్త.


తే.

దినదినంబును వా రిదేతీరుగాను
సంతతానందవార్ధిలో స్నాన మాడి
మెలఁగుచుండంగ నట దేవతలగురుండు
వాసవునిఁ జేర, నింద్రుండు వంగి మ్రొక్కి.


క.

‘అనఘా! యీ యుచితాసన
మున నుండు’ డనిన దేవముఖ్యుం ‘డటులే’