పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యని కూర్చుని ‘పిలిపించిన
పని యెయ్యది’ యనిన దేవపతి యి ట్లనియెన్.


తే.

‘మొన్నటను లేదు, నిన్ననె మొలిచె నీడ
నెయ్యదో యెఱుంగఁగఁ గోరి యిపుడు మిమ్ము
పిలువనంపితి, మన మేగవలయు’ ననఁగ
నాతఁ డాయింద్రుఁ డికకొంద రటకుఁ జనిరి.


తే.

దేవగురుఁడు మహేంద్రుఁడుఁ బోవుచుండ
వారి వెనువెంటనే స్వర్గవాసు లెల్ల
రేగి రద్దాని గాంచి వచించె గురుఁడు
‘పార్వతీపతి లింగ మై వచ్చె’ ననుచు.


తే.

అనుచు నాకుంభకర్ణుని యనుపమాన
మేఢ్రముం జూచి గురుఁడు ‘స్వామీ’ యటంచు
మ్రొక్క నత్తరి నందఱు మ్రొక్కు లిడిరి
తగినవిధిఁ బోల్చె గురుఁ డని తలచి తలచి.


వ.

అప్పు డింద్రుఁడు.


తే.

భటుల రావించి ‘శివు డింద్రుపట్టణంబుఁ
గాంచ నరుదెంచె లింగంబు గాఁగ మాఱె
నెల్లవా రిట పూజించి యేగుఁ’ డనుచు
చాటగాఁ బంచె పౌరులు సంతసింప.


ఆ.

ఇంద్రు నాజ్ఞ గాన నెల్లవారలు మన
సార నిష్ఠతోడ స్నాన మాడి
యింతకంటె భాగ్య మెయ్యది యని దాని
పూజ సల్పువిధులఁ బూనుకొనిరి.


తే.

దేవతలు దేవకాంతలు దివ్య మైన
పగిది ముస్తాబు లై స్వర్ణపళ్ళెరముల