పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆ.

ఐనఁ గొంతవఱకు నైనను వర్ణింప
కుందు నేని కవులు మందుఁ డంచుఁ
దిట్టఁగలరు, గాన నట్టి యా లంకను
బొగడ ధాత యైనఁ దగఁడు తగఁడు.


తే.

శుక్రుఁడును మున్ను గల్గు నసురులు విశ్వ
కర్మదరి కేగి వానియీకెలను చిక్కుఁ
దీయఁగా నెట్టకేలకు దివ్య మైన
పట్టణము గట్టి లంక నాఁ బెట్టెఁబేరు.


తే.

మట్టుగలకాంతలను పసిపట్టె నేని
ముప్పతిప్పలఁ బెట్టుచు తొప్పె దూర్చి
రక్త మొల్కుచు నుండగా రతికిఁ దార్చి
దంపి విడిచెడి ఘోటకతతులు గలవు.


తే.

అచ్చటియేన్గులు విషయించు నపుడు కాళ్ళ
క్రింద నున్నట్టి కొండలు కెడలి నలిగి
పిండిగా రాలి వారిధి నుండ దాని
నిసుక యంచును బల్కుదు రెల్లవారు.


తే.

పట్టణము స్వర్ణమయ మౌచు భాసిలంగ
మేడలనుగూడ వర్ణించ నేడ, మాదు
పద్యమును బాడుగా నేల, బాగు బాగు
భవనములుగూడ నట్టి వై వన్నె కెక్కు.


తే.

అచటఁ గలపూలవనముల యందు గల్గు
పూవు లెల్లను రక్కసిపూవుఁబోండ్లు
పూకులం దోఁపుకుందురు పుళ్ళు మాన
నైనచో వానిఁ బొగడ నెవ్వానితరము.


తే.

లంకఁ గలరాక్షసులయొక్కబింక మైన
మేఢ్రములు పోఁకమానుల మించి యుండ