పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వారియాకారముల నేల వర్ణనంబుఁ
జేయవలె ప్రాజ్ఞు లెల్ల రిస్సీ యనంగ.


సీ.

గడ్డికుప్పలఁబోల గలయట్టి చన్నులు
               కరిగర్భములవంటి గర్భములును
బండిచక్రము లట్ల భాసిల్లు పిఱుఁదులు
               గాన్గులం బోలిన కంఠములును
ఆదికూర్మముఁ బోలినట్టి పాదంబులు
               మందరగిరివంటి మధ్యమములు
బారలతోఁ గొల్వనేరని యూరులు
               జగతిలో లే వట్టి జంఘములును


తే.

గల్గుకాంతల పూకులఁ గల్గి నట్టి
వెండ్రుకల దీర్ఘముం జెప్ప వేధ తరమె?
యల త్రికోణపుబిలముల యావరణలు
లోతులం గన్నఁ గన్పట్టు నూతులవలె.


తే.

ఎట్టిచెలి యైన తనకొంగు నెత్తి యుచ్చఁ
బోయ నయ్యది యొకక్రోసు పొడవు బడును
పురుషులుంగూడ నట్టులే పోతురేని
మించుపో యంతకంటెను కొంచె మంత.


తే.

పంగలం జాపి ‘రా దెంగు దెంగు’ మంచు
కొంగు లెగ దీసి యాపురి కోమలాంగు
లంగడులలోనఁ దిరుగుదు రనుదినంబు
దొరకు మేఢ్రంబు లెల్లను దోఁపుకొంచు.


తే.

పురిని గల రాక్షసులు మేఢ్రములను జూచి
కొట్టునెడ తాళవృక్షముల్ గూడ నేల
పడుచు నుండుచు కాంతలు ప్రక్కఁ జేరి
దోఁపుకొందురు పూకుల లోపలగను.