పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

కాని నీయీడు లేఁతయై కానుపించి
యుండ మర్మావయవము బెంపొందియుండె
నైన బెంపొందువారలకైన సుఖము
నీకు నెబ్భంగి గల్గును బ్రాకటముగ.


క.

 గజనరవిద్యలు రెండును
నిజముగ గలిగిట్టులీవు నిసుఁగై యుంటన్
గజిబజినొందక నుల్లము
ఋజుమార్గమున న్వసించె నేమందునొకో?


చ.

గొనబుగ నీదు తెల్వి జుఱుకున్ బరికించుటకై మదీయమౌ
తనువునగల్గు నంగముల దాఁచక నీదగు చూపుతోవ నే
ననువుగనుంతు నారసి తదంగములన్ మరు లుప్పతిల్లఁగా
నొసరిన యంగమెద్ది నెనరూఱఁగ నిప్పుడె నాకుఁ దెల్పవే.


వ.

అని పలికి నిర్జనంబగు నంతస్సదనంబున నా కుందరదన లజ్జావనతవదనయై కదనప్రియుండగు మదనప్రదరబాధితహృదయమై లేచి యాక్షణంబ.


సీ.

ఎడలేని దడచే నతఁడును దా నున్నట్టి
                   పొడవుటుప్పరిగెతల్పులు బిగించి
తడఁబాటుచే గడగడ వడంకెడుకేల
                   బొడిచెక్కడఁపు నడితొడవు సీల
సడలించి వడి పోఁకముడి వీడఁజేసిన
                   గుడుసువా ల్కెనయగు వెడఁదపిఱుఁదు
కడగొని మడుగుపాల్కడలిని గెఱడులు
                   జడిగాడ్పు దాడిఁగప్పెడువడువున


తే.

పుడమి నంతట గప్ప నప్పుడు బెడంగు
టడఱున బడంతి వెడవింటి గడుసుగిడుసు
టడిదమన నిల్వఁబడియుండ బుడుతకొడుక
డుడిగిపోనట్టి వెడఁగున జడిసి కాంచె.