పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గని భ్రమపడి రహోంగము దనవ్రేలితో
                   నాడింప నది పిన్నయయ్యు గట్టి
పడి నిల్చినను దానిపొడవు ద్రాణయు
                   భావించి నివ్వెఱపాటుఁ జెంది


తే.

మోహవార్ధి మునింగిన మొఱఁగి మారుఁ
డది విలోకించి నగి సమయం బిదే య
టంచుఁ దొలిపగ నిటు దీర్చెనంచు లోకు
లెంచఁ బూచిలు కెదనాటనేసె నుమను.


వ.

తదనంతరంబ.


ఆ.

మనమునందు బొడము మన్మథవేదన
చేత ననుదినంబు చింతఁ జిక్కి
గౌరి పవలు తిండిఁ గానక రాతిరి
నిదుల లేక తమిని గిదుకుచుండె.


వ.

అంత.


మ.

కడువేడ్కన్ మలపట్టి యొక్కతఱి జల్కంబాడి చెంగావి పా
వడపై దెల్లనివల్లె ఱింగులు దలిర్పన్ గట్టి వజ్రంపు మే
ల్తొడవుల్ దాలిచి చన్నుచేపిన సుతుం దో నక్కునం దార్చి న
ల్గడలం దెవ్వరు లేరుగా యనుచు జక్కన్ గాంచి లేకున్నచోన్.


క.

 తన హావభావములకున్
మనమున నరుదంది చన్ను మఱఁగి కుడుచు నం
దను వీనులందు గుసగుస
యను చప్పుడు గాఁగ నిట్టు లామున బల్కెన్.


తే.

నిన్నుఁ గడుపునఁ గన్న నా నిండుడెంద
మిట్లు మరులంది యుండఁగా నెంచ గడుసు
లైన పెఱతెఱవలు మరులందు టెంత
వింత నినుఁ జూచినంతనే వేడ్క కొడక!