పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

గణపతీయము

[స్కాందపురాణాంతర్గతము]

క.

 శ్రీలక్ష్మీక్ష్మాంభోజవి
శాలాక్షీస్తనవిలేపచార్వంకిత వ
క్షోలావణ్య త్రిలోకీ
పాలనగుణగణ్య గోపబాలవరేణ్యా!


వ.

అవధరింపుము. సకలసువ్రతశీలిని యగు కాంచనమాలిని సమస్తార్షపురాణోక్తకథారహస్యావృత్తవప్రుండగు యవ్విప్రున కిట్లనియె.


ఉ.

ఇప్పుడు నీవు సెప్పిన యనేకములైన రహస్యవార్తలం
దొప్పుగ నామనం బలరియున్నది; విద్యలకెల్ల నొజ్జయై
మెప్పులఁగన్న వా ల్గడుపుమేఁటికి నిచ్చలు బ్రహ్మచర్యముం
జొప్పడియుండె నేమిటికి జోద్యముగా వివరించి చెప్పుమా!


క.

 అని కాంచనమాలిని బ
ల్కిన విని విప్రోత్తముండు క్రిత మీగాథ
న్వినియున్నవాఁడు గావున
మనమున సంతసముబొంది మగువకు ననియెన్.


క.

 వంకరతుండమువేలుపు
పొంకముగా బెండిలాడఁ బోవకునికి నే
నంకిలిపెట్టక నొడివెద
శంకిలకను వినుము మనము సందియ మెడలన్.


సీ.

ఒకనాఁడు గౌరి వేడుకఁ దనకౌఁగిలి
                   యందుఁ గుల్కెడు శిశువైన గుజ్జు
వేలుపు లతవలె వ్రేలు తుండము బొట్టి
                   కడుపుఁ దమ్ములవంటి కన్నుదోయిఁ