పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గుఱుతు లేకుం డొకగరితగూడిన దనపతి యని యది యేమి పలుకకున్న
నేనొండు చెలియని యెఱిఁగి కంపించిన నదిగాంచి దొంగని యఱవ నుఱికి
నాప్రక్క జేరి, యంట యేమఱించి యున్నట్లు సంకేతిత యైనదాని
నెఱిఁగి యూపిరి బిగియించి మెల్లన మొనగాళ్ళు నేలానించి గదియబోయి


గీ.

సద్దుగాకుండ బ్రక్కలో నిదురించుచున్న మగనికి సడిబడకుండ కూడి
నాతి నేను సుఖించిన నాఁటివింత మది దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

చెలియ నేనును జోడు వెలిగుఱాల్ గట్టిన సారటులో నెక్కి సమ్మదంబు
జెలఁగ జరీనకాషీ బనారసి పనుల్ జేసి మొఖమల్ గలీబు వేసి
సరిగవాక్షుల తమాషాజూచుచును ముచ్చటాడుచు మర్మంటు లంటుకొనుచు
నందులో నిడుకొని యటు యొడిలోనుండుకొని మోవి మార్పుల మొనతికాటు


గీ.

లందుచును మిర్రు పల్లంబు లందు నడ్డగను నిల్వుగ నూగుచు నొకరికైన
గాసిలేకుండ గ్రీడించి కళలు వీడజేయుచు విహార మట్లు చేసినవిధంబు
మదిఁ దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

అలివేణి నవలతా వ్యాల బి సుమమంజకులజూప వెలుదచన్నులను బట్టి
వగలాడి క్రొమ్మావి చిగురాకు గొనుమన్న వలదని కెమ్మోవి పంటనొక్కి
కమలాక్షి పున్నాగ సుమము మార్కొనుమన్న నిద్దంపుచెక్కిలిముద్దులాడి
గరిత కెందమ్మిలో కర్ణిక గనుమన్న బ్రీతితో నిధువనక్రీడ సల్పి


గీ.

లలన భావప్రకాశచెలోక్తులకు దగిన చెయ్వు లొనరించి గఱగించి చెట్టబట్టి
వనవిహారంబు జేసిన వైభవంబు మది దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

తరుణి రాక యొకింత తడవు జేసిన నల్గి ప్రక్కన కనుమోడ్చి పవ్వళింప
వచ్చినా ప్రక్కలో మచ్చిక గూర్చుండి వదలక పైవ్రాలి పెదవినొక్కి
కామధ్వజముబట్టి కదలించి ముద్దాడి తప్పుసైపుమటంచు దండమొసగి
పవళించి మోకాళ్ళు పైకెత్తి నను తనపాదములపైనుండి బనిచి దాని
నచ్చోట తేర్చి యుయ్యాలలో యటంచు నూచుచు బుజ్జగించి మఱియు


గీ.

తనిసి తనియించి తనదుహస్తములు సాచి యక్కునను జేర్చి కౌగిటఁ జిక్కబట్టి
"యలుక తీరెనె?" యని బల్కినట్టిసొంపు మది దలంప బ్రహ్మానంద మదియకాదె.