పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గనిపించుకొని ప్రీతి గనుసన్నజేయ నే దెలిసి యాచెలిగూడి దృప్తిజేసి
యలివేణి యింతసాహసము జేతురు యన నవ్వి యిన్నాళ్ళకు నన్ను నిన్ను


గీ.

నలువ యిట గూర్చెనింకొకనాడు వత్తు ననుచు నొప్పించుకొని తోడిమనిషి కెదురు
గలుసుకొనిపోయినట్టి యాకలికిపనులు మది దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

వేసవులందు నే వేటబోవఁ దలంప వేడుకజూడ మీవెంటవత్తు
ననిన నీవేల రేయడవిలో శార్దూల భల్లూక సూకరభయము తేళ్ళ
చిలువలబాధలు గలవన్న నీయొద్దనున్న నాకొకభయ మొదవదనుచు
రోదనమొనరింప నేదోడుకొనిపోయి నీటిచెంగట నొక్కమాటులో
నాసీనఁ గావించి యచ్చోటమృగముల వంచించి వధియింప బొంచియుండి
మెకములురాగ నేనొకతుపాకిని పడవ్రేయ గన్గొని నాదు వెన్ను చఱచి


గీ.

భళిరయని మెచ్చుకొనుచు వార్తలు సలుపుచు తనసమక్రీడ జేయుచు నట్టె నిళలు
క్షణములుగ బుచ్చినట్టి యాగరికచేత లెద తలంప బ్రహ్మానంద మదియ కాదె.


సీ.

నెరిసాము జేసి ముప్పరిగొన్న కనకంపుప్రతిమరాయని చెప్పవచ్చుమేను
బటువై టెంకాయ పగులగొట్టుటకు సంశయములేదని చెప్పజాలు చనులు
కఠినతయును మణికళికత్తె నెడు బంపుబంగారు సబగారుపగిది నొప్ప
విగతలోమ భగంబుబిగువునుగల యొకశ్యామయు నేనును సమ్ముదమున
నగ్నులమై మదనక్రీడ గావించుతరి నదినాపైకి దాటి కూడి
గుండియదడరనొక్కుచు మేనుచెమరింప తేలగన్నులపైడి సోలివ్రాలి
కళను నేవిడువంగ గనివేశబాసనిబలుకుచు చుబుకంబు బట్టియెడలు
గలయంగ నిమురుచు గాంతరో నిన్ను నమ్మితి నింక నామీద సతదమిట్టి


గీ.

స్నేహమంచు మటంచునేఁ జెప్పుకొనిన మాటలాడంగలేక నామమత జూచి
నాతి తలయూచి చెప్పిన నాటిహొయలు మది దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

విజిటింగుహాలులో వెలలేని నిలుదర్పణముల నన్నియు బ్రతిఫలింప
సరిగులోబులు వాలుస్లైడ్లు లస్టర్ల లోపలిదీపములు పట్టపగలుజేయ
నగరుబతీలు మేలైనయత్తరు మల్లెపూలవాసనలు పంఖాలగాలి
చేనిండి మైచర్ల చేయంగపండితుల్ చెలికాండ్లు బంధువుల్ చేరికొలువ
బంగరుబత్తెముల్ రంగుగాగొని చోపుదార్లు ముంగర బరాబర్లుచేయ